Advertisement

ఎక్స్ క్లూజివ్: బిబి3 లో ‘ఆ’ అతి ఉండకుండా బోయపాటి జాగ్రత్తలు

Posted : December 14, 2020 at 1:11 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలోనే బోయపాటి గత సినిమా వినయ విధేయ రామ సినిమా కు సంబంధించిన కొన్న ట్రోల్స్‌ నందమూరి అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వినయ విధేయ రామ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తాయి. తలను నరికితే పక్షి ఎత్తుకు వెళ్లడం.. రైళ్లు మీద దూకి ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్తాడు. ఈ సీన్స్‌ సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌ ట్రోల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిబి3 లో అలాంటి యాక్షన్‌ సీన్స్‌ ఉండకూడదనే ఉద్దేశ్యంతో బోయపాటి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరీ ఓవర్‌ డోస్‌ యాక్షన్‌ సీన్స్‌ ఉండకూడదని తానే స్వయంగా యాక్షన్‌ సీన్స్ ను ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ తో కలిసి చర్చలు జరిపి ప్లాన్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వినయ విధేయ రామ లో ఉన్న ఆ అతి సీన్స్‌ మాత్రం బాలయ్య మూవీలో ఉండవు అంటూ యూనిట్‌ సభ్యులు క్లీయర్‌ కట్‌ గా చెబుతున్నారు.


Advertisement

Recent Random Post:

ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయం | Politics of Telangana –

Posted : April 26, 2024 at 1:03 pm IST by ManaTeluguMovies

ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయం | Politics of Telangana –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement