Advertisement

సోహెల్‌కు బ్రహ్మానందం నుండి కూడా బంపర్‌ ఆఫర్‌

Posted : December 21, 2020 at 3:11 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విజేత ఎవరు అంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ట్రోఫీ విన్నర్‌ అభిజిత్‌ కాగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజేత సోహెల్‌ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. స్టేజ్ పై ట్రోఫీకంటే విలువైన మెగా ప్రశంసలు చిరంజీవి నుండి సోహెల్‌ అందుకున్నాడు. చిరంజీవి స్వయంగా తన ఇంటి నుండి సోహెల్‌ కోసం బిర్యానీ తీసుకు వచ్చాడు. ఇక సోహెల్ సినిమా చేస్తే చిరంజీవి నటిస్తానంటూ కూడా హామీ ఇచ్చాడు. సినిమాను ప్రమోట్‌ చేసేందుకు నేను వస్తానంటూ చిరు పేర్కొన్నాడు.

చిరంజీవితో పాటు బ్రహ్మానందం నుండి కూడా సోహెల్‌ కు ప్రశంసలు దక్కాయి. సోహెల్ మాట్లాడుతూ బయటకు వెళ్లిన వెంటనే బ్రహ్మానందం గారు మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన నీ కోసం షో చూశాను. నువ్వు సినిమా చేస్తే నీ కోసం ఫ్రీగా రోల్‌ చేసేందుకు సిద్దం అన్నాడట. బ్రహ్మానందం నుండి వచ్చిన ఆ కాంప్లిమెంట్‌ కు సోహెల్‌ ఆనందానికి అవధులు లేవు. పాతిక లక్షలు రావడంతో పాటు ఇంత మంది ప్రశంసలు దక్కించుకున్నందుకు అభిజిత్ కంటే అసలైన విజేత సోహెల్‌ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు.


Advertisement

Recent Random Post:

Resigned Volunteers Complaint On Kodali Nani, Case Registered

Posted : June 21, 2024 at 1:47 pm IST by ManaTeluguMovies

Resigned Volunteers Complaint On Kodali Nani, Case Registered

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement