ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎటిటి. ఎనీ టైమ్ థియేటర్. ఆన్ లైన్ లో డబ్బులిచ్చి సినిమా చూడడానికి పెట్టిన క్యాచీ నేమ్ ఇది. శ్రేయా మీడియా సంస్థ ఈ రంగంలో ముందుగా ప్రవేశించింది. ఇది చూసి మరి కొంత మంది చిన్నా చితక జనాలు ట్రయ్ చేసారు కానీ వర్క్ అవుట్ కాలేదు. సరైన కంటెంట్ లేకపోవడమే దీనికి కారణం. ఓ నిర్మాత ఓటిటి స్వంతంగా ప్రారంభిస్తే పట్టుమని వంద టికెట్ లు తెగలేదు. సరైన కంటెంట్ లేకపోతే వ్యవహారం ఇలాగే వుంటుంది.
ఇదిలా వుంటే ఇప్పుడు ఈ రంగంలోకి నిర్మాత బన్నీ వాస్, ఆయన మిత్రులు కలిసి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ అందిస్తున్న పక్కా సోఫిస్టికేటెడ్ సాఫ్ట్ వేర్ తో రంగంలోకి దిగబొతున్నట్లు బోగట్టా. అయితే కేవలం సినిమాను ఆన్ లైన్ లో వదలడం కాకుండా, చిన్న సినిమాలను తీసుకుని ప్రమోట్ చేయడం, ఆయితే లేదా థియేటర్ లో వదలడం, శాటిలైట్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి వర్క్ టేకప్ చేయడం, ఇలా అన్ని విధాలా ఓ సినిమాకు ఎన్ని చేయాలో అన్నీచేసే సంస్థగా ఇది వుంటుందని తెలుస్తోంది.
ఈ సంస్థలో బన్నీ వాస్ మిత్ర బృందం చాలా మంది భాగస్వాములుగా వుంటారని తెలుస్తోంది. మరోరెండు నెలల్లో ఇది ప్రారంభమయ్యే అవకాశం వుంది.