Advertisement

ఇందుకు కదా చంద్రబాబును విమర్శించేది ?

Posted : July 3, 2020 at 10:56 pm IST by ManaTeluguMovies

రాజకీయాలన్నాక విమర్శలు చేయాలి. కానీ.. చేసేవి ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలి. అంతేకాదు.. ఇదెక్కడి గోలండి? ప్రభుత్వం చేసే ప్రతి పనిని అదే పనిగా విమర్శించటం మినహా మరింకేమీ పని ఉండదా? అన్న భావన కలుగక కూడదు. ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ అదే పనిగా విమర్శించే ధోరణి ప్రజలకు చిరాకు తెప్పించక మానదు.

తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరు ఇప్పుడిలానే ఉంది. రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున అంబులెన్సుల్ని ప్రారంభించిన వైనం అందరిని ఆకర్షించింది. ఒకేసారి ఇంత భారీగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకూ మరే రాష్ట్రంలోనూ చూసింది లేదు. అందునా మాయదారి రోగం విరుచుకుపడుతున్న వేళలో.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వందలాది అంబులెన్సుల్ని అందుబాటులోకి తెచ్చి.. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను కళ్లకు కట్టేలా చూపించటంలో జగన్ సర్కారు సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

ఇలాంటి సమయంలో విమర్శలు చేస్తే.. ఉన్న మర్యాద కూడా పోతుంది. ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా ఇలానే విమర్శిస్తారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అంబులెన్సులపై చంద్రబాబు చేసిన విమర్శల్ని చూస్తే.. అంత అనుభవం ఉన్న అధినేత మాటలు ఇలానా ఉండేవన్న భావన కలుగక మానదు.

రాష్ట్రంలో ఇప్పుడే మొదటిసారి అంబులెన్సులు పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వ హయాంలో 1800 అంబులెన్సులు కొన్నట్లు పేర్కొన్నారు. సంచాన వైద్యశాలలు పెట్టామని.. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్ని ఏర్పాటు చేశామని.. చనిపోయిన వారికి గౌరవప్రదంగా ఇంటికి చేర్చే మహాప్రస్థానం వాహనాల్ని పెట్టినట్లుగా లిస్టు చెప్పుకొచ్చారు.

ఇవన్నీ చేసినా కానీ ప్రజలు రిజెక్టు చేశారంటే.. చేసిన కార్యక్రమాలుప్రజల వరకూ అయినా వెళ్లకుండా ఉండాలి. లేదంటే.. ప్రజల మనసుల్ని దోచేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహించటంలో ఫెయిల్ అయి ఉండాలి. ఎన్నికల్లో ఓటమిపాలై ఏడాది అయిన వేళ.. గతంలో తాము చేసిన పనుల చిట్టా చదివే బదులు.. అధికారపక్షం ఇరుకున పడేలా విమర్శలు.. ఆరోపణలు చేస్తే లాభం ఉంటుంది.

అంతేకానీ.. ప్రభుత్వం చేసిన మంచి పనిని అభినందించే గుణం తనలో లేదన్న విషయాన్ని చిన్నపిల్లాడికి సైతం అర్థమయ్యేలా వ్యాఖ్యానించటం సరికాదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. అనవసరమైన విషయాల్ని కెలికి విమర్శలు చేయటం ద్వారా తనను అభిమానించే వారు సైతం తలపట్టుకునేలా చేయటంలో బాబు తర్వాతే ఎవరైనా అన్న విషయం తాజాగా మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.


Advertisement

Recent Random Post:

Matka Trailer | Varun Tej | Karuna Kumar | Meenakshi Choudhary | Nora Fatehi | GV Prakash Kumar

Posted : November 2, 2024 at 1:58 pm IST by ManaTeluguMovies

Matka Trailer | Varun Tej | Karuna Kumar | Meenakshi Choudhary | Nora Fatehi | GV Prakash Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad