కాస్టింగ్ కౌచ్ మరియు మీటూ ఉద్యమాల్లో క్రియాశీలకంగా కనిపించే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీపాద చిన్మయి మరోసారి తన ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి అయిన అమ్మాయిలు హీరోయిన్ గా ఎందుకు నటించకూడదు అంటూ ప్రశ్నిస్తూ ఆమె తన అభిప్రాయంను చెప్పుకొచ్చింది. చిన్మయి ఇటీవల ఒక వివాహ వేడుకలో పాల్గొన్నదట. ఆ సమయంలో ఆమె తో ఒక వ్యక్తి పెళ్లి అయిన అమ్మాయిలు నటించకూడదు అన్నాడట. ఆ మాటలు ఆమెకు బాధను కలిగించాయట. అతడు బంధువే అయినా కూడా ఆ మాట అనగానే ఆయనపై చాలా కోపం వచ్చిందట.
పెళ్లి అయిన వెంటనే భర్తకు అమ్మాయి జీవితం అర్పించినట్లేనా.. అమ్మాయి శరీరం మనసు అన్ని కూడా ఆయనకు ఇచ్చేసి జీవితం లేని వ్యక్తిగా మసులుకోవాలా అంటూ ప్రశ్నించింది. పెళ్లి తర్వాత నటించకూడదు అనేందుకు మీరు ఎవరు అంటూ చిన్మయి ప్రశ్నించింది. పెళ్లి అయిన తర్వాత కూడా దీపిక పదుకునే సమంత వంటి స్టార్స్ నటిస్తున్నారు. వారు సక్సెస్ లను దక్కించుకుంటున్నారు. ఎందుకు మీరు పెళ్లి అయిన వారిని చిన్న చూపు చూస్తున్నారు అంటూ ప్రశ్నించింది. సోషల్ మీడియాలో ఆమెకు అనూహ్యంగా మద్దతు దక్కింది.