సోషల్ మీడియాలోకి మెగాస్టార్ చిరంజీవి కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా…లేటెస్ట్ అప్డేట్ లతో సందడి చేస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. ట్విటర్ వేదికగా సీసీసీ కోసం విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలపడం, లాక్ డౌన్ సమయంలో ప్రజల్ల చైతన్యం కల్పించడం కోసం సందేశాలు, లాక్ డౌన్ సమయంలో ఇంటిపనుల్లో సాయం చేస్తూ బీ ద రియల్ మ్యాన్ అనిపించుకుంటూ చిరు ….ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు.
Usually, when we shoot songs, I thoroughly enjoy listening to them and wouldn't like interruptions. But recently, I have been enjoying pausing and resuming a song over and again. కారణం … …? …tomorrow morning 9.00 am
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 27, 2020
షూటింగ్ వాయిదా పడడంతో…ఇంటికే పరిమితమైన చిరు తన ఆటోబయోగ్రఫీపై ఫోకస్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక, తనకు నచ్చిన పాటల గురించి చిరు తాజా అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేశారు. తన చిత్రాల్లోని పాటలను పాస్ చేసి వినడం తనకు ఇష్టం ఉండదన్న చిరు….ఈ మధ్య మాత్రం ఓ పాటను పాజ్ చేసి పదే పదే వింటున్నానని చెప్పారు. ఆ పాట ఏమిటో రేపు ఉదయం 9 గంటలకు రివీల్ చేస్తానని చిరు ట్వీట్ చేసి తన అభిమానులను సస్పెన్స్ లో పడేశారు.
చిరంజీవి తాజా చిత్రంగా ‘ఆచార్య’కు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్…మళ్లీ పట్టాలెక్కేందుకు మరి కొంతకాలం పట్టొచ్చు. అందుకే, ఆ చిత్రం గురించిన అప్డేట్ ఇవ్వాలని చిరు ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఆచార్య చిత్రంలోని పాట గురించే చిరు ట్వీట్ చేశారని…రేపు ఆ పాటకు సంబంధించిన అప్డేట్ …లేదా ఆ పాటకు సంబంధించిన చిన్న బిట్ రివీల్ చేస్తారేమోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా తన సినిమాలకి సంబంధించిన పాటలను వాటి చిత్రీకరణ సమయంలో పూర్తిగా వింటూ ఆనందిస్తానని, మధ్యలో పాజ్ చేయడానికి ఇష్టపడనని చిరు ట్వీట్ చేశారు. అయితే, ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ .. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. అందుకు కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతానంటూ అభిమానులను సస్సెన్స్ లో పెట్టారు చిరు. చిరంజీవి ఏ పాట గురించి చెప్పబోతున్నారో..అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఆ పాట కథా కమామీషు ఏమిటో తెలియాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడక తప్పదు.