Advertisement

చిరు, ఎన్.టి.ఆర్ సినిమాలలో సరసన ఒకప్పటి హీరోయిన్.?

Posted : May 20, 2020 at 11:23 pm IST by ManaTeluguMovies

తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒకప్పటి హీరో, హీరోయిన్స్ ని, నటీనటుల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కాంబినేషన్స్ ని చాలా ఫ్రెష్ గా ఉండేలా డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ డైరెక్టర్ సుజీత్ లు ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ‘సత్యం’, ‘సై’, ‘ఢీ’, ‘రెడీ’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో మెప్పించిన జెనీలియాని మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. పెళ్లి చేసుకొని వెళ్ళాక సినిమాలకి దూరంగా ఉన్న జెనీలియాకి తెలుగు నుంచి పలు అవకాశాలు వెళ్తున్నాయి.

అందులో మొదటిది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న ‘లూసిఫర్’ రీమేక్. సుజీత్ ఇప్పటికే ఈ సినిమా కథని పూర్తి చేయడంతో నటీనటుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అందులో ఓ ముఖ్య పాత్ర కోసం జెనీలియా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని సుజీత్ చిరంజీవి గారికి సజెస్ట్ చేశారట. చిరు కూడా సుముఖంగానే ఉండడం వలన షూటింగ్స్ అన్నీ గాడిలో పడ్డాక ఆమెని అప్రోచ్ అవ్వనున్నారని సమాచారం.

అలాగే మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాలో ఓ పాత్ర కోసం జెనీలియాని పరిశీలిస్తున్నారని సమాచారం. ఎన్.టి.ఆర్ హీరోగా నటించనున్న ఈ సినిమాని ‘ఆర్ఆర్ఆర్’ షూట్ ఫినిష్ చేయగానే సెట్స్ పైకి తీసుకెళ్లేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. 2012లో చివరి సారిగా తెలుగు తెరపై కనిపించిన జెనీలియా మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగు తెరపై కనిపించే అవకాశం కొట్టేసింది. మరి జెనీలియా మనసులో ఏముందో తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడక తప్పదు.


Advertisement

Recent Random Post:

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బీభత్సం సృష్టించిన గాలి వాన l Rains in Telugu States

Posted : May 6, 2024 at 12:31 pm IST by ManaTeluguMovies

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బీభత్సం సృష్టించిన గాలి వాన l Rains in Telugu States

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement