Advertisement

మెహర్ రమేష్‌తో చిరంజీవి సినిమానా?

Posted : April 20, 2020 at 6:12 pm IST by ManaTeluguMovies

ఈ హెడ్డింగ్ చూసినపుడు ఆటోమేటిగ్గా నవ్వు రావడం సహజం. ఒక చిన్న హీరో సైతం మెహర్‌తో సినిమా అంటే భయపడే పరిస్థితి ఉండగా.. చిరంజీవి అతడితో జట్టు కట్టడం జోక్ లాగా అనిపించవచ్చు. కానీ స్వయంగా మెగాస్టారే ఈ మాట చెబితే ఎలా స్పందించాలో అర్థం కాదు మరి.

తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. మెహర్ రమేష్‌తోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు మెగాస్టార్. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న సినిమా అయిపోయాక ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించిన చిరు.. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలుస్తూ బాబీ (కె.ఎస్.రవీంద్ర) కూడా తనకో కథ చెప్పినట్లు తెలిపాడు.

బాబీతో చిరు సినిమా అంటేనే అభిమానులకు ఏదోలా ఉంటే.. మెహర్ రమేష్‌తో సినిమా కోసం కూడా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించి విస్మయానికి గురి చేశాడు చిరు. వీళ్ల పేర్లన్నీ చెప్పి యువ దర్శకులతో సినిమాలు చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చిరు తెలిపాడు. ఐతే మెహర్‌ను యువతరం దర్శకుడిగా చిరు ఎలా భావించాడో ఏంటో మరి.

‘కంత్రి’ లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన మెహర్‌కు చెప్పుకోదగ్గ సినిమా అంటే రీమేక్ అయిన ‘బిల్లా’ మాత్రమే. ఆ తర్వాత ‘శక్తి’, ‘షాడో’ లాంటి ఆల్ టైం డిజాస్టర్లు డెలివర్ చేశాడతను. ఈ మధ్యే ‘శక్తి’ సినిమాకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా మెహర్‌ను సోషల్ మీడియా జనాలు ఒక ఆట ఆడుకున్నారు. ఆ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అతడి పరిస్థితి ఇంతే.

జనాల దృష్టిలో మెహర్ ఏంటి అన్నది విడమరిచి చెప్పాల్సిన పని లేదు. ‘షాడో’ రిలీజై ఏడేళ్లు అవుతున్నా అతడికి ఎవ్వరూ ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు. అతడి కెరీర్ క్లోజ్ అయిపోయిందని అందరూ ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చేసిన తరుణంలో చిరు అతడితో చర్చలు జరుపుతున్నట్లు చెప్పడం మామూలు షాక్ కాదు.


Advertisement

Recent Random Post:

RanaRangam : “బాబాయ్.. అబ్బాయ్.. ఓ కడప నియోజకవర్గం” | CM YS Jagan | Pulivendhula | AP Politics

Posted : April 26, 2024 at 11:45 am IST by ManaTeluguMovies

RanaRangam : “బాబాయ్.. అబ్బాయ్.. ఓ కడప నియోజకవర్గం” | CM YS Jagan | Pulivendhula | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement