Advertisement

క్రాక్ దర్శకుడ్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

Posted : January 19, 2021 at 8:12 pm IST by ManaTeluguMovies

మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోన్న విషయం తెల్సిందే. 9 రోజుల్లో ఈ చిత్రం బిజినెస్ ను రికవర్ చేయడమే కాకుండా దాదాపు 9 కోట్ల ప్రాఫిట్స్ ను తీసుకొచ్చింది. క్రాక్ సినిమా అటు ఆడియన్స్ నే కాకుండా సెలబ్రిటీలను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే క్రాక్ చిత్రాన్ని చూసి ఇంప్రెస్స్ అయ్యాడు. వెంటనే రవితేజ, గోపీచంద్ మలినేనిలకు ఫోన్ చేసి అభినందించారు. దర్శకుడ్ని పర్సనల్ గా కలవమని పిలుపునిచ్చారు. ఈరోజు చిరంజీవిని గోపీచంద్ మలినేని కలిసాడు.

మెగాస్టార్ ను కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని గోపీచంద్ ఈ సందర్భంగా అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన నుండి ఎంతో నేర్చుకోవచ్చని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. ఇది తనకు మెగా డే అని వ్యాఖ్యానించాడు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన క్రాక్ రవితేజ కెరీర్ లో కంబ్యాక్ ఫిల్మ్ అనవచ్చు. ఎందుకంటే నాలుగు సినిమాల తర్వాత రవితేజ ఈ సినిమాతో సక్సెస్ సాధించాడు.


Advertisement

Recent Random Post:

క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ | Iran missile attack on Israel

Posted : October 2, 2024 at 12:21 pm IST by ManaTeluguMovies

క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ | Iran missile attack on Israel

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad