Advertisement

ఎక్స్ క్లూజివ్: మరో పాత రీమేక్ ని పట్టాలెక్కించి పనిలో మెగాస్టార్ చిరు

Posted : February 2, 2021 at 3:33 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, యంగ్ హీరోస్ కి బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఇవ్వడమే కాకుండా, ఈ ఏడాది దాదాలు మూడు సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అందులో మొదటగా ఆచార్యని మే 13న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు. అలాగే ఇటీవలే లాంచ్ చేసిన లూసిఫర్ రీమేక్ ని కూడా ఫిబ్రవరి చివరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి ఏప్రిల్ కల్లా ఫినిష్ చేయాలనుకుంటున్నారు.

ఈ రెండిటి తర్వాత మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత చిరు కోసం బాబీ ఇప్పటికే క్యూలో ఉన్నారు. ప్రస్తుతానికి చిరు కమిట్ అయి ఉన్న చిత్రాల జాబితా ఇది.. మేము తెలుసుకున్న లేటెస్ట్ ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటి అంటే.. చిరు మరో రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఫిక్స్ అయ్యారట.

ఆ విషయంలోకి వెళ్తే.. చిరు వేదాళంతో పాటు మరో అజిత్ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఆ సినిమానే 2015లో వచ్చి సూపర్ హిట్ అయిన గౌతమ్ మీనన్ ‘ఎన్నై అరిందాల్’. ఇదే సినిమా తెలుగులో కూడా ‘ఎంతవాడు గాని’ అనే టైటిల్ తో డబ్ చేయగా, హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాని రీమేక్ చేసే పనిలో చిరు ఉన్నారట. అందులో భాగంగా సరైన డైరెక్టర్ కోసం అన్వేషణలో ఉన్నారని సమాచారం. ఎన్నై అరిందాల్ రీమేక్ కోసమని చాలా రోజుల క్రితమే కొణిదెల ప్రొడక్షన్స్ వారు రీమేక్ రైట్స్ తీసుకున్నారట

చిరంజీవి సై అంటే సరికొత్త కథలతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు కానీ చిరు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతూ రీమేక్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండడం విశేషం. అందులోనూ డబ్బింగ్ పేరుతో తెలుగులో విడువులై కాస్త హిట్ అయిన సినిమాలనే ఆయన రీమేక్స్ కోసం సెలక్ట్ చేసుకుంటూ ఉండడం అందరినీ షాకింగ్ కి గురి చేస్తోంది. చూద్దాం ఏ తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ ఈ రీమేక్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకుంటారో.


Advertisement

Recent Random Post:

ఆఫ్గాన్ క్రికెట్ ప్రయాణం… అందరికీ ఆదర్శం..| Afghanistan Cricket Team

Posted : June 27, 2024 at 11:56 am IST by ManaTeluguMovies

ఆఫ్గాన్ క్రికెట్ ప్రయాణం… అందరికీ ఆదర్శం..| Afghanistan Cricket Team

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement