Advertisement

అప్పులు తీసుకోవడంలో ఏపీ తెలంగాణలది జెట్ స్పీడ్

Posted : July 15, 2020 at 6:42 pm IST by ManaTeluguMovies

రాష్ట్ర విజభన తర్వాత తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా మారితే.. అందుకు భిన్నమైన పరిస్థితిని ఏపీలో నెలకొంది. మిగులు బడ్జెట్ లో తెలంగాణలో.. లోటు బడ్జెట్ లో ఏపీ ఉంది. అప్పుల భారం కూడా ఎక్కువే. ఆదాయం మొత్తం తెలంగాణకు పోతే.. అప్పుల కుప్పలా ఏపీ నిలిచింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పులు పంచటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గడిచిన ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెగ అప్పులు చేసేస్తున్నాయి.

తాజాగా కొత్త నివేదికను ఆర్ బీఐ విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు తెగ అప్పులు చేస్తున్న వైనం బయటకు వచ్చింది. తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరిగితే.. ఆంధ్రప్రదేశ్ లో 42 శాతంగా ఉంది. గత ఏడాది దేశంలో అప్పులు తీసుకునే రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం ఆరో స్థానానికి ఎదిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్న వైనం బయటకు వచ్చింది.

గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా అత్యధిక అప్పులు తీసుకుంటున్న జాబితాలో యూపీ.. తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. పశ్చిమబెంగాల్.. మహారాష్ట్రలు మూడు.. నాలుగు స్థానాల్లో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ లు నిలిచాయి. రాజస్థాన్.. గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. తాజాగా ఈ జాబితాలో ఏపీ మూడో స్థానానికి.. తెలంగాణ ఆరో స్థానానికి ఎగబాకింది.

తెలంగాణ రాష్ట్రంలో 2018-19లో బహిరంగ మార్కెట్ లో స్థూలంగా రూ.26,740 కోట్లు అప్పు సేకరిస్తే.. 2019-20లోరూ.37,109 కోట్లను స్థూల రుణంగా సేకరించింది. ఈ ఆర్థికసంవత్సరంలో ఏప్రిల్.. మేలో స్థూలంగా రూ.8వేల కోట్లు సేకరించినట్లుగా ఆర్ బీఐ పేర్కొంది. ఇప్పటివరకూ తీసుకున్న అప్పుతో సహా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రుణాన్ని రూ.48వేల కోట్ల వరకు తీసుకునే వీలుంది.
తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ విషయానికి వస్తే.. 2018-19తో పోలిస్తే 2019-20లో ప్రభుత్వం సేకరించిన అప్పు 42.10కు పెరిగింది. ఈ ఏడాది మార్చి.. ఏప్రిల్.. మే లలో నెలకు సగటున రూ.3333వేల కోట్లను తీసుకుంది. ఇప్పటివరకూ ఇలా తీసుకున్న స్థూల రుణం రూ.10వేల కోట్లుగా చెబుతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అప్పుల మీద అప్పులు తీసుకోవటం గమనార్హం.


Advertisement

Recent Random Post:

Newly Married Couple Goes Missing in Nellore

Posted : November 1, 2024 at 8:27 pm IST by ManaTeluguMovies

Newly Married Couple Goes Missing in Nellore

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad