రాష్ట్ర విభజన జరిగి ఆరు ఏళ్లు గడిచి పోయినా కూడా తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ, గోదావరి బోర్డ్ లు ఏర్పాటు అయ్యి ఆరు ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు వాటి పరిధిని నిర్ణయించలేదు.
రెండు రాష్ట్రాలు కూడా ప్రతి ఏడాది నీటి వాటాల గురించి గొడవ పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వివాదాల పరిష్కారంకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రెండు రాష్ట్రాల మద్య ఉన్న వివాదాన్ని చర్చించి పరిష్కరించాలని భావిస్తున్నారు.
వచ్చే నెల 6వ తారీకున గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అపెక్స్ సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈ సమావేశ తేదీకి ఓకే చెప్పారట.
కృష్ణ గోదావరి లపై కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్‌ల విషయంలో కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలు కూడా ఈ సమావేశంలో వాదనలు వినిపించేందుకు తమ నీటి అవసరాలను చెప్పేందుకు సిద్దం అవుతున్నాయి.