సీఎం పదవి తన కాలి చెప్పుతో సమానం అంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ తమిళిసై కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఒక రాష్ట్రం ఎంతో ముఖ్యమైన పదవిని, ఆ పదవిలో ఉన్న వ్యక్తి కించ పర్చే విదంగా మాట్లాడటం దారుణం అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు అని, నువ్వు కాలా చెప్పుతో పోల్చిన సీఎం పదవికి నిన్ను దూరం చేసే రోజు దగ్గరకు వచ్చింది అంటూ అరవింద్ అన్నాడు.
ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకులకు కూడా కాస్త కోపంను తెప్పిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన బర్తరఫ్ కు డిమాండ్ చేస్తున్నట్లుగా గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీఎం పదవిపై గౌరవం లేని వ్యక్తిని సీఎంగా కూర్చోబెట్టడం ఏమాత్రం సబబు కాదు అంటూ కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ పొగరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆ పార్టీ నాయకులు కొందరు చర్చించుకుంటున్నారు. కొందరు టీఆర్‌ఎస్ నాయకులు మాత్రం ఏదో మాట వరసకు అలా అన్నారు. దాన్ని ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరమే లేదు అంటున్నారు.