ఈనెల 20న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇటివల బీజేపీ, ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకుల్ని కలవబోతున్నారు. ఈక్రమంలో కేంద్రంపై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలిపారు. ఈక్రమంలో కేసీఆర్ కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి ముంబై రావాలని.. తమ ఆతిధ్యం స్వీకరించాలని కోరారు.
‘కేసీఆర్ జీ.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంపై మీ పోరాటానికి నా మద్ధతు తెలుపుతున్నా. సరైన సమయంలో మీరు మీ పోరాటాన్ని ప్రారంభించారు. రాష్ట్రాల హక్కుల కోసం.. దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు చేస్తున్న పోరాటంలో మద్దతు అందిస్తాం. ఈక్రమంలో దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసేందుకు మేము మీకు సహకరిస్తాం’ అని అన్నారు. వీరి భేటీలో భవిష్యత్ కార్యాచరణ, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది.