Advertisement

తెలంగాణను విమర్శించిన ఏపీలోనే నేడు కరెంటు లేదు: సీఎం కేసీఆర్

Posted : February 21, 2022 at 5:53 pm IST by ManaTeluguMovies

‘తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని తెలిసి ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇక్కడి నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయన్నారు. తెలంగాణలో అంధకారం అలుముకుంటుందన్నారు. అప్పుడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది. ఇప్పుడు తెలంగాణలో 24గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది’.

‘గతంలో ఇక్కడి ప్రజలకు కూడా నమ్మకం లేదు. కేసీఆర్.. వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా..? రాదా..? అని..! రాష్ట్రం సాధించాం.. ఏడేళ్లలో తెలంగాణలో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి’’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నారాయణ్‌ఖేడ్‌లోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

గతంలో నారాయణఖేడ్ చాలా వెనుకబడి ఉంది. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా లబ్ది చేకూరుతుంది. 4427 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4 లక్షల ఎకరాలకు నీరందుతుంది. వచ్చే రెండేళ్లలో ఈప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.


Advertisement

Recent Random Post:

Bigg Boss Buzzz | Nayani Pavani’s Exclusive Exit Interview | Ambati Arjun

Posted : November 4, 2024 at 9:53 pm IST by ManaTeluguMovies

Bigg Boss Buzzz | Nayani Pavani’s Exclusive Exit Interview | Ambati Arjun

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad