Advertisement

కరోనా మరణాల్లో తెలంగాణను దాటేసిన ఆంధ్రప్రదేశ్‌

Posted : April 24, 2020 at 10:37 pm IST by ManaTeluguMovies

తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో దిక్కుమాలిన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు హయాంలోనూ అదే పరిస్థితి. వైఎస్‌ జగన్‌ హయాంలోనూ అదే పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వైఎస్‌ జగన్‌ విమర్శించారు.. వైఎస్‌ జగన్‌ అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఎలా చూసినా ఇద్దరి కారణంగా రాష్ట్రం నష్టపోయింది.

అభివృద్ధి సంగతి పక్కన పెడితే, కరోనా వైరస్‌ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాల్లో తెలంగాణని మించిపోయింది ఆంధ్రప్రదేశ్‌. నిజానికి, కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా చూస్తే ప్రస్తుతానికి (ఏప్రిల్‌ 24 లెక్కల ప్రకారం) ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ ముందంజలో వుంది. కానీ, మరణాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను మించిపోవడం గమనార్హం. ఎందుకిలా.? ఈ ప్రశ్నకి వైసీపీ సమాధానమేంటో తెలుసా.? చంద్రబాబు 3 లక్షల కోట్లు అప్పు చేసి పోయారని. దానికీ, దీనికీ లింకేంటి.? అంటే, అదే మరి నీఛమైన రాజకీయమంటే.

చంద్రబాబు హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నది వైసీపీ ఆరోపణ. మరి, ఏడాది పాలనలో వైసీపీ ఏం చేసిందట.? దీనికి మాత్రం వైసీపీ దగ్గర సమాధానం దొరకదు. ఒకరు తక్కువా కాదు.. ఇంకొకరు ఎక్కువా కాదు.. చంద్రబాబుకి ధీటుగా వైఎస్‌ జగన్‌ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అధికార పీఠమ్మీద కూర్చుని. ప్రభుత్వ కార్యాలకు పార్టీ రంగులేసుకున్న ఖర్చుతో, హైద్రాబాద్‌ని తలదన్నే ఆసుపత్రుల్ని నిర్మించుకోవచ్చు. కానీ, పార్టీ రంగుల మీదున్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద వైసీపీకి వుంటుందని ఎలా అనుకోగలం.?

పత్రికలు, ఛానళ్ళలో తమ ప్రభుత్వం తరఫున ప్రకటనల కోసం ఇస్తున్న ఖర్చుతో వైద్య రంగానికి మేలు చేయొచ్చన్న కనీస విజ్ఞత వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి లేకపోవడం శోచనీయం. చంద్రబాబు ఏం చేశారో, వైఎస్‌ జగన్‌ కూడా అదే చేస్తున్నారు. ఇదే రాష్ట్రానికి శాపంగా మారుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోందని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోందిగానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల్లోనూ తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ దాటేయనుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి.


Advertisement

Recent Random Post:

జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం…! | YS Jagan Received ₹1,750 Crore From Adani Group

Posted : November 22, 2024 at 8:27 pm IST by ManaTeluguMovies

జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం…! | YS Jagan Received ₹1,750 Crore From Adani Group\

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad