Advertisement

టిక్ టాక్ వీడియోలు చేయడానికి కారణాలు తెలిపిన డేవిడ్ వార్నర్

Posted : June 22, 2020 at 8:13 pm IST by ManaTeluguMovies

ఈ లాక్ డౌన్ సమయంలో క్రికెట్ వ్యవహారాలు ఏవీ లేకపోవడంతో ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండలేక టిక్ టాక్ వీడియోల మోజు పెంచుకున్నాడు వార్నర్. ఈ క్రమంలో తెలుగు, తమిళ, హిందీ పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి ఇండియాలో సినీ ప్రియులను విశేషంగా ఆకర్షించాడు. బుట్ట బొమ్మ సాంగ్ టిక్ టాక్ తో మొదలైన వార్నర్ ప్రస్థానం మైండ్ బ్లాక్ సాంగ్ తో పాటు పలు పాటలకు డ్యాన్స్ చేయడం వరకూ వెళ్ళింది.

రీసెంట్ గా ఇండియా టుడేతో ముచ్చటించిన డేవిడ్ వార్నర్ అసలు టిక్ టాక్ చేయడానికి గల కారణాలు చెప్పాడు. కరోనా మహమ్మారి ఉదృత్తంగా ఉన్న సమయంలో ప్రజలు అందరూ వివిధ కష్టాలు పడుతున్నారని, వారి ముఖాలపై చిరునవ్వులు చిందించడం కోసమే ఇలా టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చాడు వార్నర్.

అలాగే తనకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మధ్య తేడాలు తెలియవని, అభిమానులు తనను ఏ పాటను చేయమని ఎక్కువ కోరారో ఆ టిక్ టాక్ లు చేసానని తెలిపాడు. మొదట బుట్ట బొమ్మను ఎక్కువమంది కోరారు. దాంతో ఆ టిక్ టాక్ చేశా. ఏదేమైనా భారతీయ పాటలకు డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఎంతో శ్రద్ధతో పాటు కఠిన శ్రమ ఉండాలి. నేను చేసిన టిక్ టాక్ లకు కూడా చాలా ప్రాక్టీస్ చేశాను అని తెలిపాడు వార్నర్.


Advertisement

Recent Random Post:

‘All Good Here’ | Hearing on OceanGate sub tragedy Reveals the Crew’s final Messages

Posted : September 17, 2024 at 9:43 pm IST by ManaTeluguMovies

‘All Good Here’ | Hearing on OceanGate sub tragedy Reveals the Crew’s final Messages

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad