దీపికా పదుకోన్ రీసెంట్ గా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెల్సిందే. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాతో దీపికా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. ఇక తాజా సమాచారం ప్రకారం దీపికా తెలుగు రీమేక్ లో నటించనుందని తెలుస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అరుంధతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో అరుంధతి ఒక ఐకానిక్ చిత్రం. అనుష్క రేంజ్ ఈ చిత్రంతో అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు దక్కించుకుంది.
అల్లు అరవింద్ బాలీవుడ్ లో పాగా వేయడానికి భారీ ప్లాన్స్ వేసుకున్నాడు. ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ రీమేక్ ను అదే పేరుతో నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పుడు అరుంధతి రీమేక్ కు దీపికా అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను అప్రోచ్ అవ్వడం, ఆమె వెంటనే ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయట. దీని గురించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది.