Advertisement

థియేటర్‌ లో పేపర్లు విసిరిన దిల్‌ రాజు

Posted : April 9, 2021 at 5:40 pm IST by ManaTeluguMovies

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు పవన్‌ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. పవన్‌ కళ్యాణ్ తో సినిమాను నిర్మించేందుకు సుదీర్ఘ కాలంగా వెయిట్‌ చేస్తున్న దిల్‌ రాజు ఎట్టకేలకు వకీల్‌ సాబ్‌ తో ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్‌ సాబ్‌ ను అభిమానులతో కలిసి థియేటర్‌ లో దిల్‌ రాజు భార్యతో కలిసి చూశాడు. థియేటర్‌ లో అభిమానుల సమక్షలో సినిమా చూసిన దిల్‌ రాజు ఒక పవన్‌ అభిమానిగా మారిపోయి ఎంజాయ్‌ చేశాడు.

థియేటర్లలో అభిమానులు హీరో ఎంట్రీ ఇచ్చిన వెంటనే కాగితాలు పెద్ద ఎత్తున జల్లుతూ ఉంటారు. అలాగే దిల్‌ రాజు కూడా తన అభిమాన హీరో వచ్చిన వెంటనే పేపర్లు జల్లుతూ తన ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దిల్‌ రాజు పేపర్లు జల్లుతున్న థియేటర్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దిల్‌ రాజు ఈ సినిమా పై మొదటి నుండి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. అన్నట్లుగానే ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆయన ఈ సినిమాతో లాభం దక్కించుకోకున్నా పర్వాలేదు కాని పవన్‌ తో సినిమా చేశాననే సంతోషంతో ఉన్నారు.


Advertisement

Recent Random Post:

ఒక్క మరణం.. వెయ్యి ప్రశ్నలు | HCU Student Rohith Vemula Case

Posted : May 6, 2024 at 12:18 pm IST by ManaTeluguMovies

ఒక్క మరణం.. వెయ్యి ప్రశ్నలు | HCU Student Rohith Vemula Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement