ఎవరికీ భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, ఉన్నది ఉన్నట్లు కుండా బద్దలు కొట్టి మాట్లాడడంలో స్టార్ డైరెక్టర్ తేజ ముందుంటారు. ఈ కరోనా టైములో ఆయన స్టార్ హీరోస్ అండ్ వారి స్టాఫ్ గురించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఈ కరోనా వలన షూటింగ్స్ అన్నీ ఆగిపోయి ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. జూన్ 15 నుంచి షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా వారు పెట్టిన కండిషన్స్ కి లోబడి షూటింగ్ చేయలేమని భావించి పెద్ద సినిమాల వారు ఎవరూ షూటింగ్ ప్రారంభించలేదు.
ఇటీవలే టీవీ సీరియస్ వారు ప్రారంభించినా, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో సీరియల్ షూటింగ్స్ కూడా మళ్ళీ ఆగిపోయాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే ఇచ్చిన పర్మిషన్స్ ని కూడా ప్రభుత్వం ఆపేస్తుందని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు.
సినిమా షూటింగ్స్ ప్రారంభం ఎప్పుడు ఉండచ్చు అని అడిగితే డైరెక్టర్ తేజ మాట్లాడుతూ ‘ టీవీ ఇండస్ట్రీలో జరిగిన విషయం ఇంకా సినిమా వారు గ్రహించినట్లు లేరు. ఇలానే కొనసాగితే కండిషన్స్ తో ఇచ్చిన షూటింగ్ పర్మిషన్స్ కూడా నిలిపివేస్తారు. నేను షూటింగ్స్ కి వ్యతిరేకిని కాదు కానీ సెట్లో చెప్పిన రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. సినిమా సెట్స్ లో ఫిల్మ్ మేకర్స్ పెద్ద స్టార్స్ ని మరియు వారి స్టాఫ్ ని అని అతిగారాబంగా చూసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో సెట్ లో ఆ పాంపరింగ్ అనేది సేఫ్టీ రూల్స్ కి ఆటంకం కలిగిస్తుంది. సెట్లో స్టార్స్ కంటే వాళ్ళ స్టాఫ్ ఒక్కోక్కరు స్టార్స్ లా బిహేవ్ చేస్తూ, చెప్పాలంటే స్టార్స్ కన్నా మేమే ఎక్కువ అన్నట్లు బిహేవ్ చేస్తూ ఇబ్బందులు పెడుతుంటారని’ సెట్లో ఉన్న సమస్యల గురించి కుండా బద్దలు కొట్టినట్లు చెప్పారు.
జులై నుంచి కాస్త పరిస్థితులు బెటర్ అయితే తేజ, గోపీచంద్ తో చేయనున్న తన తదుపరి సినిమా ‘అలిమేలు మంగ వెంకటరమణ’ షూటింగ్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.