ఆయన ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఇప్పుడు మాత్రం ఆయన్ని ‘బూతు’లో భవిష్యత్తు వెతుక్కుంటోన్న ఓ ‘మానసిక రోగి’లా చూస్తున్నారు. ఏదో ఒక సంచలనం కోసం నిత్యం ‘కక్కుర్తి’ పడే, సదరు మాజీ సంచలన.. ప్రస్తుత ‘పబ్లిసిటీ కక్కుర్తి’ డైరెక్టర్, టాలీవుడ్‌లో ఓ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని సినిమా చేయబోతున్నాడట. ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. అలా ఆయన్ని ‘ప్రోత్సహిస్తోన్న’ బ్యాచ్.. సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయింది. సదరు ‘బూతు’ డైరెక్టర్, తన సినిమాలోని క్యారెక్టర్లని పేర్కొంటూ, అందులో కొన్ని ‘బఫెలోస్’ని కూడా చేర్చాడు.
సో, ఇక్కడ ఆయనగారి ‘ఉద్దేశ్యం’ సుస్పష్టం. కొన్నాళ్ళ క్రితం సదరు సినీ కుటుంబంపై బురదజల్లే క్రమంలో ఓ సీ-గ్రేడ్ నటిని తీసుకొచ్చి, బూతులు తిట్టించిన వైనం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. రెండు ప్రముఖ రాజకీయ పార్టీలు ఈయన్ని పోషిస్తుండడంతో.. ఒక్కోసారి ‘తిండి, తాగుడు’ ఎక్కువైపోయి, పెంచి పోషించిన పార్టీ మీదనే ‘కక్కేస్తుంటాడు’ సదరు ‘బూతు’ డైరెక్టర్. ఎంచక్కా హీరోయిన్ల కాళ్ళ సందుల్లో కెమెరాలు పెట్టుకోక.. టాలీవుడ్‌లో ఓ గౌరవ ప్రదమైన కుటుంబం మీద తన సినిమా పైత్యాన్ని ఎందుకు ప్రదర్శించడం.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
గతంలో ఇదే తరహాలో తీసిన ‘కక్కుర్తి’ సినిమాలు ఎలా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయో చూశాం. కంటెంట్ అనవసరం.. తనను ఎంకరేజ్ చేసే పేటీఎం బ్యాచ్‌తోపాటు, ‘పచ్చదళం’లో కొంత బ్యాచ్ కూడా వుండడంతో.. అయ్యగారి పైత్యానికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది. సినిమా అనేది ఓ కళ. ఆ కళకి.. కళంకంగా మారిపోయాడీ ‘బూతు’ డైరెక్టర్. బూతు సినిమాలు తీసేటోళ్ళు చాలామందే వున్నారుగానీ.. ఆ బూతు సైతం అసహ్యించుకునేస్థాయికి ఈ డైరెక్టర్‌గారి బాగోతం పెరిగిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.
మరీ ఇంత బానిసత్వమా.? పైగా, ‘నేను మోనార్క్.. నేనెవడికీ భయపడను..’ అంటాడు.! నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన, తన వైవాహిక జీవితాన్ని ఎప్పుడో ‘సంక నాకించేసిన..’ ఈ బూతు డైరెక్టర్, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటాన్ని ఏమనుకోవాలి.? అసలు ఇలాంటోళ్ళని ఏ పేర్లతో పిలవాలి. ‘అలాంటి బానిసల్ని పట్టించుకోవడం అనవసరం..’ ఇదీ సదరు డైరెక్టర్ మీద కొందరు నెటిజన్ల అభిప్రాయం. కానీ, కొందరుంటారు.. ‘మా ప్రత్యర్థిని తిడుతున్నావ్.. నువ్వు చాలా గొప్పోడివ్..’ అని పొగిడేస్తున్నారు. నీతి, జాతి.. అన్నీ వదిలేశాడు కదా.. రేప్పొద్దున్న అట్నుంచి ‘ముష్టి’ తన బొచ్చెలో పడితే, గేర్ రివర్స్ అయిపోవడం ఖాయం.