Advertisement

ఫ్లాప్ సినిమాకు ఈ మేలమేంటి?

Posted : June 27, 2020 at 12:18 pm IST by ManaTeluguMovies

ఫ్మూడేళ్ల కిందట విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఫలితమేంటో అందరికీ తెలుసు. విడుదలకు ముందున్న హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చి ఉండొచ్చు కానీ.. ఆ చిత్రం జనాల మెప్పు పొందలేదన్నది వాస్తవం. దీనికి రివ్యూలన్నీ నెగెటివ్, యావరేజ్‌గానే వచ్చాయి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా మిక్స్‌డ్‌గానే కనిపించింది. బాక్సాఫీస్ లెక్కల్లో చూసినా ఈ సినిమా ఫ్లాపే. ఈ విషయాన్ని ఎవరో ఎందుకు.. స్వయంగా నిర్మాత దిల్ రాజే ఒప్పుకున్నాడు.

సినిమా రిలీజైనపుడు ఆయన కూడా కలెక్షన్ల గురించి గొప్పగా చెప్పుకున్నాడు కానీ.. ఆ తర్వాత ఓ సందర్భంలో సినిమా బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిందని.. ‘ఫిదా’ సినిమాకు తన బయ్యర్లు తక్కువ డబ్బులు కట్టి లాస్‌ను కవర్ చేసుకున్నారని అన్నారాయన. బన్నీ సైతం ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎప్పుడూ పెద్దగా చెప్పుకున్నది లేదు.

కానీ దర్శకుడు హరీష్ శంకర్‌ మాత్రం ‘డీజే’ ఫ్లాప్ అంటే ఒప్పుకోడు. సినిమా రిలీజ్ తర్వాత రివ్యూయర్లపై, సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడేవాళ్లపై అతనెలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఇప్పుడు ‘డీజే’ విడుదలై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో హరీష్ ట్విట్టర్లో పెద్ద ఎత్తునే సంబరాలు చేశాడు. అల్లు అర్జున్ అభిమానులు కూడా ‘డీజే’ హ్యాష్ ట్యాగ్స్‌తో నిన్నంతా రెచ్చిపోయి ట్రెండ్స్ చేశారు. బన్నీ కెరీర్లోనే దువ్వాడ జగన్నాథం బెస్ట్ క్యారెక్టర్లలో ఒకటన్నట్లు.. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్, ఒక క్లాసిక్ అన్నట్లుగా ట్వీట్లు గుప్పించారు. మిలియిన్లు మిలియన్లు టార్గెట్‌గా పెట్టుకుని ట్రెండ్స్ నడిపించారు.

ఈ లాక్ డౌన్‌ మొదలైనప్పటి నుంచి సినిమా స్థాయి ఏంటో చూడకుండా వార్షికోత్సవ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి హడావుడి చేయడం మామూలైపోయింది. ‘జానీ’ లాంటి ఆల్ టైం డిజాస్టర్‌కు కూడా పెద్ద ట్రెండే నడిచింది. ఈ కోవలోనే ‘డీజే’ గురించి కూడా హడావుడి చేశారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. ‘క్లాసిక్’ స్టేటస్ అందుకుని జనాల మనసుల్లో నిలిచిపోతాయి.

‘డీజే’ ఆ కోవకు చెందింది కూడా కాదన్నది సినిమా చూసిన ఎవ్వరైనా అంగీకరిస్తారు. అయినా పది పన్నెండేళ్ల పిల్లాడు గన్ను పట్టి రౌడీల్ని, గూండాల్ని ఏరేయడానికి రెడీ అయితే.. ఒక పోలీసాఫీసర్ అతడితో చేతులు కలిపి మిషన్ మొదలుపెట్టడం అనే సిల్లీ కాన్సెప్ట్‌తో మొదలయ్యే సినిమా ‘డీజే’ అన్నది బన్నీ ఫ్యాన్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాని గురించి ఇంత హంగామా చేసే వాళ్లు కాదేమో.


Advertisement

Recent Random Post:

పోసాని, RGV కి తత్వం బోధపడిందా.. ? | Posani Krishna Murali Quit From Politics | RGV Cases

Posted : November 22, 2024 at 6:06 pm IST by ManaTeluguMovies

పోసాని, RGV కి తత్వం బోధపడిందా.. ? | Posani Krishna Murali Quit From Politics | RGV Cases

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad