హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు దక్కించుకున్న ఎస్తర్ ఆ మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రముఖ సింగర్ తో పెళ్లి.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల విడాకులు. ఇలా జీవితంలో ఒడిదుడుకుల కారణంగా కొన్నాళ్ల పాటు పాక్షికంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్ళీ 69 సంస్కార్ కాలనీ అనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
మార్చి 18 వ తారీఖున ఈ సినిమా థియేటర్లు ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ ట్రోల్స్ తో సినిమా గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా ఒక పెళ్ళైన మహిళ పరాయి కుర్రాడితో సాగించిన రొమాన్స్ సినిమా లో ప్రధానంగా చూపించడంతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటూ సోషల్ మీడియాలో జనాలు చిత్ర యూనిట్ సభ్యుల పై గగ్గోలు పెడుతున్నారు. ఒక గృహిణి తన సంసార జీవితాన్ని సాఫీగా సాధించకుండా ఇలా పరాయి వ్యక్తితో గడిపేందుకు సిద్ధం అవ్వడం చూపించడం మన సంస్కృతి సంప్రదాయానికి పూర్తి విరుద్ధం అంటూ కొందరు వాదిస్తున్నారు.
ఈ సమయంలో హీరోయిన్ ఎస్తర్ రిలీజ్ ప్రెస్ మీట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మగ వారికి మాత్రమే కాదు ఆడ వారికి కూడా కోరికలు ఉంటాయి అనేది ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశాము. అంతే కానీ ఈ సినిమాలో తప్పుడు విషయాలను ఏమి చూపించలేదని చెప్పుకొచ్చింది. సినిమాలో ఆ పాత్రలో నటించిన హీరోయిన్ మాత్రమే కాకుండా హీరోయిన్ తో కనిపించిన కుర్రాడు కూడా తప్పు చేశాడు.
అతడిని అలా ఎందుకు నటించావని ఎవ్వరూ అడగరు. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకలా నటించావు.. అలా నటించినందుకు కనీసం విజ్ఞత లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మగవారు ఆడవారు అనే వ్యత్యాసం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మగ వాళ్లకు మాదిరిగానే ఆడవాళ్లకు కూడా సమానమైన హక్కులు కల్పిస్తున్నామని చెబుతూనే ఆడ వారిని చిన్నచూపు చూసేందుకు వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ కించపరుస్తూ ఉన్నారంటూ ఎస్తర్ ఎమోషనల్ అయింది.
ఆమె ప్రెస్ మీట్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో సినిమా గురించి మరింతగా జరుగుతుంది. ఈ సినిమాలో అజయ్ భార్యగా ఎస్తర్ కనిపించింది. భర్త డ్యూటీ కి వెళ్లిన సమయంలో ఇంట్లో కిరాయికి ఉండే కుర్రవాడితో గృహిణి చేసే రొమాన్స్ ఉండే ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.