మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం మాత్రమే మిగిలున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారని.. బీజేపీ నేతలను కలిసారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ అంశంపై మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల ప్రయత్నించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే.. నేరుగా కలవలేదని ఇప్పటికి ఫోన్ లో మాత్రమే మాట్లాడుకున్నామన్నారు.
త్వరలో ఈటలతో కలిసి చర్చలు జరుపుతానన్నారు. ఈటలతో కలసి అసెంబ్లీలో 15ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్‌కు ఉపఎన్నిక వస్తే పోటీ చేయాలా లేదా అనే అంశంలో ఇంకా అధిష్ఠానంతో చర్చించలేదన్నారు. పలు రాజకీయాంశాలపై మాట్లాడారు. బీజేపీపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీలో గ్రూపులున్న విషయం ఆయనకెలా తెలుసని ప్రశ్నించారు? తాను కేసీఆర్‌కు అనుకూలమనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.