తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలనే కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఓటేస్తే వచ్చే లాభం ఏమీ లేదని.. వారికంటే మనకే నెట్ వర్క్ ఎక్కువుందని అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ తెలంగాణను వాడుకుంది. బీజేపీ అన్నేళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదన్నారు.
తెలంగాణ అమలు చేసిన మిషన్ భగీరధ, రైతు బంధును కేంద్రం కాపీ కొట్టింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 7778 మెగా వాట్ట విద్యుత్ ఉత్పత్తి ఉంటే.. ఇప్పుడు 16వేలకు పెరిగింది. తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటు కంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధంచిన వృద్ధి రేటు ఎక్కువ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు.