Advertisement

వి, టక్ జగదీష్ హిట్స్ అంటోన్న నాని

Posted : December 23, 2021 at 6:11 pm IST by ManaTeluguMovies

న్యాచురల్ స్టార్ నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రెండూ చిత్రాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలవ్వగా ఈ రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇవి కనుక థియేటర్లో విడుదలై ఉంటే కచ్చితంగా ప్లాప్ అయ్యేవని చాలా మంది అభిప్రాయపడ్డారు.

అయితే నాని మాత్రం ఈ రెండు సినిమాలు సక్సెస్ అని చెబుతున్నాడు. నిర్మాతలకు వచ్చిన లాభాలు, అమెజాన్ వారికి వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్, ఓటిటిలో చూసిన నిముషాలు.. ఇలా అన్నీ లెక్క వేసుకుంటే రెండు సినిమాలూ కూడా మంచి సక్సెస్ సాధించాయని, ఈ సినిమాలు సక్సెస్ అయినందుకు కేక్ కూడా కట్ చేసారని నాని అభిప్రాయపడ్డాడు.

ఇక జెర్సీ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, శ్యామ్ సింగ రాయ్ కు కూడా అలాంటి ఫీలింగ్ వచ్చిందని, కచ్చితంగా గొప్ప సినిమా అవుతుందని నాని అభిప్రాయపడ్డాడు.


Advertisement

Recent Random Post:

EC Serious Warning To Leaders On Morphing And Comments | Chandrababu | CM YS Jagan

Posted : May 7, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

EC Serious Warning To Leaders On Morphing And Comments | Chandrababu | CM YS Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement