స్టార్ అయినా వ్యాపారవేత్తలు అయినా పెళ్లి అయిన వెంటనే కనీసం 15 రోజులకు తగ్గకుండా హనీమూన్‌కు వెళ్తూ ఉంటారు. ఈమద్య కాలంలో పెళ్లి చేసుకున్న స్టార్స్ అంతా కూడా హనీమూన్‌ను ఎంజాయ్ చేసిన వాళ్లే. కాని కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న నిఖిల్ మాత్రం కరోనా కారణంగా హనీమూన్‌ను ఎంజాయ్ చేయలేక పోతున్నాడు. పెళ్లికి ముందు హనీమూన్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసుకోవడంతో పాటు టికెట్లను కూడా బుక్ చేసుకున్న నిఖిల్ జంట వాటిని క్యాన్సిల్ చేసుకున్నాయట.
విదేశాలతో పాటు మన దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ జంట విహరించాలని కోరుకుందట. కాని లాక్ డౌన్ కారణంగా విదేశాలకు కాదుకదా కనీసం పక్క రాష్ట్రంకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ విపత్తు నుండి బయట పడ్డ తర్వాత అంతర్జాతీయ స్థాయి విమానాలు ప్రారంభం అయిన తర్వాత అప్పుడు హనీమూన్‌కు వెళ్లాలని, ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని నిఖిల్ అనుకున్నాడు. పెళ్లి తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా వర్క్ లో పడ్డాడు.
ప్రస్తుతం ఈయన కార్తికేయ 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో దర్శకుడితో కలిసి పాల్గొంటున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ సిక్స్ ప్యాక్ బాడీని కూడా ట్రై చేయబోతున్నాడట. డాక్టర్‌గా నిఖిల్ కనిపించబోతున్నట్లుగా ఇటీవల విడుదలైన నిఖిల్ బర్త్‌డే పోస్టర్‌తో వెళ్లడయ్యింది. కార్తికేయ మొదటి పార్ట్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.