తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను విడదీసి చూడలేం. ఎప్పటినుండో అక్కడ హీరోలకు, బిజెపి ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బిజెపి విభాగం వాగ్వాదానికి దిగిన విషయం తెల్సిందే.
తాజాగా సూర్య సినిమాటోగ్రఫీ బిల్ విషయంలో స్పందించినందుకు బీజేపీ కు చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమిళనాడు రాష్ట్ర బిజెపి యువజన కార్యవర్గం నిర్వహించిన సమావేశంలో సూర్యపై విమర్సలు గుప్పించారు. కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం సూర్య సినిమాలు మాత్రం చూసుకోవాలని, అనవసర విషయాలలో జోక్యం తగదని సూర్యకు వార్నింగ్ ఇచ్చారు.
తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, సూర్య ఇదే రీతిలో కేంద్రాన్ని విమర్శిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. సూర్య గతంలో కూడా కేంద్ర నీట్ సెలక్షన్ విధానం పట్ల విమర్శలు చేశారు. దీనివల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించాడు.