Advertisement

ఆ లెజెండ్‌ను వాడుకోని తెలుగు సినిమా

Posted : April 29, 2020 at 8:45 pm IST by ManaTeluguMovies

ఇర్ఫాన్ ఖాన్.. ఈ ఉదయం నుంచి భారతీయ సినీ రంగంలో చర్చనీయాంశమవుతున్న పేరు. ఈ లెజెండరీ బాలీవుడ్ నటుడు క్యాన్సర్‌తో పోరాటంలో అలసిపోయి తనువు చాలించాడు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం తనువు చాలించారు.

ఒక గొప్ప నటుడిని కోల్పోయామంటూ భాషతో సంబంధం లేకుండా సినీ ప్రియులు ఆవేదన చెందుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇండియన్ ఫిలిం హిస్టరీని తీసుకుంటే అత్యంత గొప్ప నటుల్లో ఇర్ఫాన్ ఒకడని చెప్పొచ్చు. చాలా తక్కువ సమయంలో ఆయన గొప్ప స్థాయిని అందుకున్నారు.

లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వర్ల్డ్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాల్లో ఇర్ఫాన్ కీలక పాత్రలు పోషించాడు. ఆ సినిమాల్లో ఇర్ఫాన్‌ను చూసి ఇతను మనోడు అని గర్వపడ్డారు భారతీయ ప్రేక్షకులు. ఇక బాలీవుడ్లోనూ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించాడు ఇర్ఫాన్.

ఎఫర్ట్ లెస్‌గా ఇర్ఫాన్ ఎమోషన్లు పలికించే తీరు గొప్పగా ఉంటుంది. తెరపై ఆయన చాలా క్యాజువల్‌గా కనిపిస్తూనే బలమైన ముద్ర వేస్తాడాయన. ఆయన నటనలో ఒక విలక్షణత కనిపిస్తుంది. క్యాన్సర్ బారిన పడటానికి ముందు ఇర్ఫాన్ నుంచి వచ్చిన ‘హిందీ మీడియం’ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయం సాధించింది.

ఇర్ఫాన్ గొప్పదనాన్ని చాటింది. క్యాన్సర్‌ నుంచి కొంచెం కోలుకుని మొదలుపెట్టి ఆపేసిన ‘అంగ్రేజీ మీడియం’ సినిమాను పూర్తి చేశాడు ఇర్ఫాన్. అస్వస్థతతో ఇబ్బంది పడుతూనే ఆ సినిమాలో నటించాడు. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోకున్నా ఇర్ఫాన్ ప్రత్యేకతను చాటి చెప్పింది.

విశేషం ఏంటంటే.. ఇర్ఫాన్ దక్షిణాదిన ఒకే ఒక్క సినిమా చేశాడు. అది తెలుగులోనే కావడం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సైనికుడు’ ఆయనే విలన్. కాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇర్ఫాన్ పాత్ర కూడా అనుకున్న స్థాయిలో లేదు. ఇరిటేట్ చేస్తుంది. పాత్రలో లోపం వల్ల ఇర్ఫాన్ నట కౌశలం మన తెలుగు ప్రేక్షకులకు తెలియలేదు.
ఆయన్ని ఆ సినిమాలో సరిగ్గా వాడుకుని ఉంటే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించి ఉండేవాడేమో. ఐతే ఆ సినిమా తర్వాత ఇర్ఫాన్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. హాలీవుడ్లో తన కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశమున్న నటుడు ఇలా అర్ధంతరంగా తనువు చాలిచండం విశషాదం.


Advertisement

Recent Random Post:

సనాతన ధర్మం ఉంటేనే దేశం నిలబడుతుంది : AP Deputy CM Pawan Kalyan

Posted : November 1, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

సనాతన ధర్మం ఉంటేనే దేశం నిలబడుతుంది : AP Deputy CM Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad