Advertisement

జబర్దస్త్ కమెడియన్ కు ఎర్ర చందనం లింకులు!!

Posted : May 25, 2021 at 9:13 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అయితే అప్పుడప్పుడూ ఈ కమెడియన్స్ వివాదాల్లో కూడా చిక్కుకుంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరికు సంబంధాలు ఉన్నట్లు తేలిందట. వివరాల్లోకి వెళితే స్మగ్లింగ్ జరుగుతోంది అన్న సమాచారం రావడంతో నాగంట్ల, చికిమనకొన, వెస్ట్ బీట్ తదితర ప్రాంతాలలో అధికారులు కూంబింగ్ నిర్వహించగా మూడు లక్షలు విలువ చేసే ఎర్ర చందనం పట్టుబడింది.

అలాగే వీరి వద్ద రెండు నాటు తుపాకులు లభ్యమయ్యాయి. మొత్తం 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఈ 8 మంది గ్యాంగ్ తో జబర్దస్త్ హరికి లింకులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడన్న ఆరోపణలు వచ్చాయి. షకలక శంకర్ నటించిన సినిమాకు హరి ఫైనాన్స్ అందించాడని చెబుతుంటారు. గతంలో హరి వాటిని ఖండించాడు.


Advertisement

Recent Random Post:

Hindupuram: పెళ్లి చేసుకున్న 15 రోజులకే భర్తకు మస్కా కొట్టిన భార్య |

Posted : October 3, 2024 at 8:51 pm IST by ManaTeluguMovies

Hindupuram: పెళ్లి చేసుకున్న 15 రోజులకే భర్తకు మస్కా కొట్టిన భార్య |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad