స్వలింగ సంపర్కుల ప్రేమకథతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ దోస్తానా(2008) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ ని ఈ సినిమా నుంచి తప్పించాక వేరొక నటుడు లక్ష్యతో కరణ్ జోహార్ ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఇకపోతే ఇందులో జాన్వీ కపూర్ ఇచ్చే ట్రీట్ పై అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.
ఇంతకుముందు ప్రియాంక చోప్రా దోస్తానాలో అదరగొట్టింది. దేశీ గాళ్ అంటూ బోలెడంత మ్యాజిక్ చేసింది. ఇప్పుడు దోస్తానా సీక్వెల్లో కుర్రబ్యూటీ జాన్వీ కపూర్ అంతకుమించి అనే రేంజులో చెలరేగిపోవడం ఖాయమని హింట్ అందింది. జాన్వీ ఇప్పటికే వరుసగా బికినీ షూట్లతో మతులు చెడగొడుతోంది. యువతరం తనని సోషల్ మీడియాల్లో అనుసరించేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఇమేజ్ తనకు పెద్ద ప్లస్ కానుంది. మరోవైపు జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
తాజాగా జాన్వీ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. జాన్వీ బాడీ కాన్ ఫ్రాక్ లో అదరగొట్టింది. శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న లైట్ బ్రౌన్ ఫ్రాక్ లో మెరుపులు మెరిపించింది. ట్రెడిషనలా.. వెస్ట్రనా? అంటూ స్మైల్ ఈమోజీతో కుర్రబ్యూటీ అభిమానుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఫోటోకి లైక్ లు క్లిక్ లు హోరెత్తుతున్నాయి. జాన్వీ ఎలాంటి దుస్తులు ధరించినా ఆదరించేందుకు తామున్నామంటూ చిలిపి యూత్ అంతే ఇదిగా స్పందిస్తున్నారు.
జాన్వీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.
`మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. మామ్ శ్రీదేవి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికను సిద్ధం చేసింది.