కపూర్ డాటర్స్ జాన్వీ కపూర్ – ఖుషీ కపూర్ ఇటీవల గూగుల్ లో ట్రెండింగ్ గాళ్స్ గా మారారు. నిరంతరం ఈ సిస్టర్స్ కోసం అభిమానులు అంతర్జాలంలో గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాగ్రమ్ లో వీడియోలు ఫోటోల కోసం అభిమానులు తరచి తరచి చెక్ చేస్తున్నారు. అంతగా వేడి పుట్టించడం కపూర్ గాళ్స్ కే సాధ్యమైంది.
ఇక ఇటీవల ఖుషీ కపూర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా బోనీ కపూర్ 66వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు ఇప్పుడు బయటికి వచ్చాయి. వాటిలో తండ్రి బోనీ కపూర్ తన ఇద్దరు కుమార్తెల నుంచి ప్రేమను అందుకున్నారు. పెద్ద కుమార్త జాన్వీకి బోనీ ఒక పెక్ (ముద్దు) ఇవ్వగా.. చిన్న కూతురు ఖుషీ తన బుగ్గపై పెక్ ఇచ్చి ప్రేమగా లాలించడం కనిపించింది. అయితే ఖుషీకి పాపా ప్రాధాన్యతనివ్వడాన్ని జాన్వీ జీర్ణించుకోలేకపోతోంది. అదిగో అలా ముఖం మాడ్చుకుని పాపా వైపు కోపంగా చూస్తోంది. దానర్థం ప్రేమంతా చెల్లికేనా నాక్కూడా! అనేది జాన్వీ భావం.
జాన్వీ కపూర్ కోపంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో దూసుకెళుతున్నాయి. గురువారం నాడు నిర్మాత బోనీ కపూర్ 66వ ఏట అడుగుపెట్టారు. ఆయన పిల్లలు జాన్వీ కపూర్- ఖుషీ కపూర్ – అర్జున్ కపూర్- అన్షులా కపూర్ సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బోనీజీ 66వ పుట్టినరోజు సందర్భంగా తండ్రికి జాన్వీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
జాన్వి సోషల్ మీడియాలో పార్టీ నుంచి రెండు చిత్రాలను పంచుకున్నారు. మొదటి ఫోటోలో బోనీ కుమార్తె బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. బోనీ సోదరుడు సంజయ్ కపూర్ -చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కెమెరాకు పోజులివ్వగా.. ఆమె చిత్రానికి చక్కని క్యాప్షన్ ఇచ్చింది. “హ్యాపీ బర్త్ డే ఫాదర్!! ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తి మీరు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను“ అని వ్యాఖ్యను జోడించారు. మరొక చిత్రంలో ఖుషీ తన తండ్రిని ముద్దుపెట్టుకోవడం చూడవచ్చు. అయితే జాన్వి ముఖం కాస్త కోపంగా కనిపిస్తోంది. జాన్వీ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ “మీరు చెల్లిపైనే ఎక్కువ శ్రద్ధ చూపించినప్పటికీ” అని రాశారు.
బోనీ మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు కాగా.. రెండో భార్య శ్రీదేవికి ఇద్దరు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య నుండి బోనీకి పిల్లలు అయిన అర్జున్ కపూర్ – అన్షులా కపూర్ కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అర్జున్ తన సోదరి అన్షులా – బోనీతో కలిసి చిన్ననాటి ఫోటోని పంచుకున్నాడు. అతను ఆ ఫోటోకి మంచి క్యాప్షన్ ఇచ్చాడు. “నిస్వార్థంగా ఉండటం అనేది ఒకరికి నేర్పించదగినది కాదు. ఇది చాలా తక్కువ మంది వ్యక్తులలో ఉన్న ఒక అంతర్నిర్మిత యంత్రం. నేను అలాంటి వ్యక్తులలో ఒకరి కుమారుడిని. నా తండ్రి ఇతరుల కోసం పరిష్కారాలను కనుగొనడంలో సహాయం చేయడానికి తన మార్గంలో బయలుదేరడం.. తనకు సహాయం చేయడం మర్చిపోవడం.. తన అవసరాలను తీర్చుకోవడం అంత సులభం కాదు … నిస్వార్థంగా ఉండటం మరియు జీవించి ఉండటమే కాకుండా రాజుగా జీవించిన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నీ…. లవ్ యూ నాన్న“ అని అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు.