Advertisement

సర్కారు వారి పాట పాడబోతున్న వైకుంఠపురంలో ఫాదర్‌

Posted : March 22, 2021 at 8:59 pm IST by ManaTeluguMovies

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్‌ ను దక్కించుకుంది. గత ఏడాది బిగ్గెస్ట్‌ సక్సెస్ ను దక్కించుకున్న ఆ సినిమాలో మలయాళ స్టార్‌ నటుడు జయ రామ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకే ఆయన్ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌ బాబుకు తండ్రి పాత్రలో జయరామ్ కనిపించబోతున్నాడు.

అల వైకుంఠపురంలో తండ్రి పాత్ర పోషించిన జయరామ్‌ మరోసారి తండ్రిగా కనిపించబోతున్న నేపథ్యంలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సర్కారు వారి పాట కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు ఉన్న జయరామ్‌ మరియు మహేష్‌ బాబుల కాంబో సీన్స్ తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

పాపం మీదంటే మీది అని అధికార, ప్రతిపక్షాల విమర్శలు | Tirupati Laddu Row

Posted : September 24, 2024 at 12:03 pm IST by ManaTeluguMovies

పాపం మీదంటే మీది అని అధికార, ప్రతిపక్షాల విమర్శలు | Tirupati Laddu Row

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad