Advertisement

జస్ట్ ఆస్కింగ్ జూనియర్ ఎన్టీయార్ మీద పడ్డారేంటి.?

Posted : November 25, 2021 at 8:28 pm IST by ManaTeluguMovies

ఫాఫం జూనియర్ ఎన్టీయార్.. తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాడు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో కూడా వీడియో సందేశాల ద్వారా టీడీపీ కోసం పని చేశాడు.

కానీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏం చేశారు.? తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. నానా రకాలుగా ఎన్టీయార్‌ని అవమానాలకు గురిచేశారు చంద్రబాబు. కొడాలి నాని పేరుతో, వల్లభనేని వంశీ పేరుతో.. ఎన్టీయార్‌ని ఇరకాటంలో పడేయడానికి చంద్రబాబు ఓ దశలో నందమూరి బాలకృష్ణని కూడా ప్రయోగించారు.

ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలతో జూనియర్ ఎన్టీయార్ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేయిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది టీడీపీ ఆరోపణ. చంద్రబాబు ఏకంగా మీడియా ముందు ఈ విషయమై కంటతడి కూడా పెట్టేశారు.

ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులు కొందరు మీడియా ముందుకొచ్చారు.. చంద్రబాబుకి బాసటగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ అయితే ఏకంగా ఓ వీడియో సందేశం పంపారు. అయితే, ‘నందమూరి కుటుంబ సభ్యుడిగా కాదు.. ఓ పౌరుడిగా, ఓ భర్తగా, ఓ కుమారుడిగా, ఓ తండ్రిగా స్పందిస్తున్నాను..’ అంటూ వైసీపీ తీరుని ఖండించాడు.

అయితే, జూనియర్ ఎన్టీయార్ స్పందన మాత్రం చంద్రబాబు అండ్ టీమ్‌కి నచ్చలేదు. అవి ప్రవచనాల్లా వున్నాయంటూ వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నఎద్దేవా చేశారు. మేనత్త భువనేశ్వరికి అండగా వుండాల్సిన జూనియర్ ఎన్టీయార్, ఇంత మెత్తగా స్పందిస్తాడా.? అంటూ మండిపడ్డారు.
ఇదెక్కడి చోద్యం.? దూషణలకు దిగారని అంటున్నారు కదా.. టీడీపీ నేతలు పోలీసుల్ని ఆశ్రయించొచ్చు, కోర్టు మెట్లెక్కొచ్చు.. అవేవీ చెయ్యకుండా, ఎన్టీయార్ పేరుని వివాదాల్లోకి లాగడమేంటో.? ఇలాంటివే టీడీపీని మరింతగా దెబ్బతీస్తాయ్. ఇకపై జూనియర్ ఎన్టీయార్‌ని అభిమానించేవారెవరూ టీడీపీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి వుండకపోవచ్చు.


Advertisement

Recent Random Post:

TCS, Infosys, Wipro Sacked 64,000 IT Employees | Tech layoffs 2024

Posted : April 21, 2024 at 7:28 pm IST by ManaTeluguMovies

TCS, Infosys, Wipro Sacked 64,000 IT Employees | Tech layoffs 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement