Advertisement

చరణ్‌ – శంకర్‌ మూవీలో హీరోయిన్‌ ఎవరంటే..!

Posted : March 24, 2021 at 6:43 pm IST by ManaTeluguMovies

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ మరియు దిగ్గజ దర్శకుడు శంకర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. దర్శకుడు శంకర్‌ అన్ని విధాలుగా ఆలోచించి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు గాను కియారా అద్వానీని ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ సినిమాను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న కియారా అద్వానీని భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చరణ్‌ మరియు కియారా అద్వానీలు ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పర్చింది. అయినా కూడా కియారా అద్వానీని చరణ్‌ కు జోడీగా ఎంపిక చేయడం పట్ల మెగా అభిమానులు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో నిర్ణయం ఏంటీ అనేది చూడాలి. ప్రస్తుతం చరణ్‌ ఆచార్య మరియు ఆర్ఆర్‌ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాల తర్వాత శంకర్‌ సినిమాను పట్టాలెక్కిస్తాడు.


Advertisement

Recent Random Post:

బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై దాడి | AP Eelection 2024

Posted : April 29, 2024 at 9:49 pm IST by ManaTeluguMovies

బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై దాడి | AP Eelection 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement