Advertisement

చందమామ బ్యూటీ అమ్మ అవ్వబోతుందా? లేదా?

Posted : November 9, 2021 at 3:30 pm IST by ManaTeluguMovies

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దాదాపు పుష్కర కాలం పాటు కొనసాగింది. ఇప్పటికి కూడా ఈమె సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. పెళ్లి తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇటీవల నాగార్జునతో కమిట్ అయిన మూవీ నుండి కాజల్ తప్పుకుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గర్బవతి అని కూడా ప్రచారం మొదలు అయ్యింది. గర్బవతి అవ్వడం వల్లే కమిట్ అయిన సినిమాను క్యాన్సిల్ చేసుకుందని చందమామ బ్యూటీ గురించి కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ కోసం ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల కాజల్ షేర్ చేసిన పిక్స్ చూస్తుంటే కాజల్ గర్బవతేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో ఆమె ఒక చిట్ చాట్ లో గర్బం దాల్చిన విషయమై కాస్త నోరు విప్పింది. మీరు తల్లి కాబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా ఇప్పుడే నేను ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుతాను అంటూ తేల్చి చెప్పింది. స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసిన కాజల్ ఉన్నట్లుండి సినిమా నుండి తప్పుకోవడం అంటే ఖచ్చితంగా ఆమె అమ్మ కాబోతుంది అనిపిస్తుంది. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఆ అనుమానాలను మరింతగా పెంచేలా ఉన్నాయి. కాజల్ గర్బవతి కానట్లయితే మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లు మాత్రమే.. నేను కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను చేయలేక పోతున్నాను అని స్పష్టంగా చెప్పవచ్చు. కాని ఆమె మాత్రం అలా చెప్పకుండా సమయం వచ్చినప్పుడు చెప్తాను అనడం కొంత అనుమానానికి తావిస్తుంది.

కాజల చెల్లి నిషా చాలా ఏళ్ల క్రితమే తల్లి అయ్యింది. అక్క కంటే ముందు పెళ్లి చేసుకున్న నిషా అక్క కంటే ముందుగానే మాతృత్వపు అనుభూతిని అనుభవించింది. చెల్లి పిల్లలను మరియు సోదరుడి పిల్లలను చూస్తుంటే తనకు కూడా పిల్లలను కనాలని ఉందంటూ గతంలో ఒకసారి కాజల్ వ్యాఖ్యలు చేసింది. అందుకే పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకు కాజల్ సిద్దం అయ్యిందని అంటున్నారు. ఆమె నోటి నుండే తాను అమ్మను అవ్వబోతున్నాను అనే ప్రకటన వస్తుందేమో చూడాలి. అమ్మగా కాజల్ మారడానికి చాలా ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అమ్మతనం గురించి ఆమె మళ్లీ ఎప్పుడు స్పందిస్తుంది అనేది చూడాలి. ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కాబోతుంది. వెబ్ సిరీస్ లో కూడా నటించిన కాజల్ ముందు ముందు మరిన్ని ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిద్దాం.


Advertisement

Recent Random Post:

Raju Yadav Trailer | Getup Srinu, Ankita Kharat | Krishnamachary. K | Harshavardhan Rameshwar

Posted : May 6, 2024 at 1:32 pm IST by ManaTeluguMovies

Raju Yadav Trailer | Getup Srinu, Ankita Kharat | Krishnamachary. K | Harshavardhan Rameshwar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement