Advertisement

పెళ్లి నేపథ్యంలో కాజల్ ఇంట్రెస్టింగ్ మూవీ

Posted : June 4, 2021 at 4:48 pm IST by ManaTeluguMovies

2007లో లక్ష్మి కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చందమామ కాజల్. చందమామ- మగధీర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించాక స్టార్ హీరోయిన్ గా వెనుదిరిగి చూడాల్సిన పని లేకుండా రెండు దశాబ్ధాల కెరీర్ బండిని సునాయాసంగా నడిపించేసింది. ఈ జర్నీలో కాజల్ తమిళం హిందీలోనూ సత్తా చాటే ప్రయత్నం చేసింది.

తెలుగు తమిళంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తున్న కాజల్ భారతీయుడు 2లోనూ కథానాయిక. నాగార్జున-ప్రవీణ్ సత్తారు చిత్రంలోనూ కాజల్ నాయిక. ఇతర చిత్రాలతోనూ కెరీర్ పరంగా బిజీగా ఉంది.

తాజాగా చందమామ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేశారు. తధాగతట సింఘ దర్శకత్వంలో `ఉమ` అనే చిత్రంలో లీడ్ పాత్రను పోషిస్తోంది. ఇది పెళ్లి నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కనుంది. పూర్వీకులకు చెందిన పాత కాలం ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక అపరిచితురాలైన ఉమా రాకతో ఇంట్లో ఎలాంటి ట్విస్టు బయటపడింది? అన్నది తెరపై చూడాల్సిందే.

అవిషేక్ ఘోష్ (అవ్మా మీడియా) & మంత్రరాజ్ పాలివాల్ (మిరాజ్ గ్రూప్) ఈ చిత్రానికి నిర్మాతలు. అన్ని కోవిడ్ -19 ప్రోటోకాల్ లను పరిగణనలోకి తీసుకొని 2021 సెకండాఫ్ లో ఒకే సుదీర్ఘ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేస్తారట. ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడి కానున్నారు.

తాజాగా కాజల్ ట్విట్టర్ లో స్పెషల్ ఫోటోషూట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇది తన ఫిట్నెస్ సెషన్స్ నుంచి షేర్ చేసిన ఫోటో. కాజల్ బ్లూ స్పోర్ట్ డ్రెస్ లో ఎంతో అందంగా ఫిట్ గా కనిపిస్తోంది.


Advertisement

Recent Random Post:

Jani Master’s National Award Cancelled

Posted : October 6, 2024 at 7:52 pm IST by ManaTeluguMovies

Jani Master’s National Award Cancelled

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad