Advertisement

త్వరలో హీరోయిన్ కాజల్ పెళ్లి.. పెళ్లికొడుకు ఇతడే..?

Posted : October 5, 2020 at 11:27 pm IST by ManaTeluguMovies

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్ డిజైనర్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ చదువుకునే సమయం నుంచీ స్నేహితులనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని.. పెద్దలు అంగీకారంతోనే వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది. వివాహ నిశ్చితార్ధం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై కాజల్.. ఆమె కుటుంబసభ్యులు ఎవరూ ఇంకా స్పందించలేదు.

కొన్నేళ్లుగా కాజల్ పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని గతంలోనే చెప్పింది ఈ చందమామ. ఆమె పెళ్లి వార్తలు నిజమే అయితే.. కాజల్ మాట నిజమైనట్టే. గౌతమ్ కిచ్లు ముంబైలో పెద్ద పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. సినిమాల్లో 14 ఏళ్ల లాంగ్ కెరీర్ పూర్తి చేసుకున్నా కాజల్ ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’, తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 సినిమా చేస్తోంది.


Advertisement

Recent Random Post:

Chit Scam 20 Crores Fraud | Hyderabad | చిట్టీల పేరుతో 20 కోట్లు మోసం

Posted : November 8, 2024 at 12:02 pm IST by ManaTeluguMovies

Chit Scam 20 Crores Fraud | Hyderabad | చిట్టీల పేరుతో 20 కోట్లు మోసం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad