చందమామ కాజల్ అగర్వాల్ ఒక ఇంటిది కాబోతున్న విషయం తెల్సిందే. ముంబైకు చెందిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకుంటోంది. వీరిద్దరూ ఎప్పటినుండో స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి పెద్దల అనుమతితో వివాహానికి దారి తీసింది. ఈ నెల 30న కాజల్ – గౌతమ్ ల వివాహం జరగనుంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తన పెళ్ళికి చాలా తక్కువ మందినే వివాహానికి ఆహ్వానిస్తోంది. కేవలం 20 మంది దగ్గరి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. కాజల్ ఇంట్లోనే ఈ వివాహం జరగనుంది.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ఇప్పుడు తన కొత్త ఇంటిని సెట్ చేసుకునే పనిలో పడ్డారు. కాజల్ తన ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ పెట్టిన స్టేటస్ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. కొత్త ఇంటిని సెట్ చేసుకుంటున్నాం. ఏమైనా సలహాలు ఇవ్వండి అంటూ కాజల్ పోస్ట్ పెట్టింది. అలాగే ఈ పోస్ట్ లో తన మిస్టర్ ఎక్కడ ఉన్నాడు అంటూ తనను కూడా ట్యాగ్ చేసింది.
పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలను యధావిధిగా కంటిన్యూ చేస్తానని వెల్లడించింది కాజల్ అగర్వాల్. ఎప్పటిలానే తనపై ప్రేమను ఇలానే కురిపించాలని కోరింది.
Share