ఒకప్పుడు ఆయన జనసేన పార్టీలో వుండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో, జనసేన మీద విమర్శలు చేయడం అనేది ఆయా నాయకులకు అలవాటే. కానీ, నిఖార్సయిన జనసైనికుడిగా కళ్యాణ్ దిలీప్ సుంకరకి మంచి పేరుంది. జనసైనికుడని అనడం కంటే, పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. అని చెప్పడం కరెక్ట్ అతని గురించి. ‘పవనిజం’ అంటే ఇదేనంటారు చాలామంది.
అప్పుడప్పుడూ జనసైనికుల ఆగ్రహానికి గురవుతుంటాడు కళ్యాణ్ దిలీప్, ఆయా విషయాల్లో కుండబద్దలుగొట్టినట్లు మాట్లాడటం ద్వారా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తరఫున నిలబడి, రాజకీయ ప్రత్యర్థుల మీద దుమ్మత్తి పోసేస్తే సరిపోదు, పవన్ కళ్యాణ్ మేలు కోరి, అవసరమైనప్పుడు సద్విమర్శ కూడా చేయగలిగినప్పుడే.. నిఖార్సయిన అభిమాని అవుతారని కళ్యాణ్ దిలీప్ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు.
స్వతహాగా న్యాయవాది కావడం, అంతకు మించిన మాటకారితనం.. విషయ పరిజ్ఞానం.. ఇవన్నీ కళ్యాణ్ దిలీప్ సుంకరని, పవన్ కళ్యాణ్ అభిమానులందరిలోకీ ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాయి. ‘ఓపెన్ ఎటాక్ విత్ ఆర్కే’ పేరుతో ఓ ప్రముఖ మీడియా సంస్థ అధినేత మీద చేసిన సెటైరికల్ వీడియోల సిరీస్ బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సోషల్ మీడియా తెరిస్తే, అందులో చాలా సెటైరికల్ వీడియోలు వివిధ అంశాలపై కనిపిస్తుంటాయి. కానీ, కళ్యాణ్ దిలీప్ వీడియోలు.. సెటైరికల్ అనే కాదు.. అంతకు మించి, సమాజంలో మార్పు కోసం ఉపయోగపడే చాలా అంశాలు కలిగి వుంటాయి.
కేవలం జనసైనికుల్నే కాదు, సమాజంలో ప్రతి ఒక్కర్నీ చైతన్య పరిచేలా వుంటాయి. రాజకీయ వ్యవస్థ ఏంటి.? అందులో ఎవరి అధికారాలు ఎలా వుంటాయి.? ఎలా ఎవర్ని నిలదీయవచ్చు.? అన్న అంశాల్ని సవివరంగా పేర్కొంటుంటారు కళ్యాణ్ దిలీప్. గూబ పగలగొట్టి, వెన్నపూస రాసినట్లే వుంటాయి ఆయన వీడియోలు. ‘ఓపెన్ ఎటాక్’ మాత్రమే కాకుండా, చాలా అంశాలపై ఆయన వీడియోలు చూస్తుంటారు. ఈ వీడియోలన్నిటికీ మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తక్కువ కాలంలోనే బోల్డంతమంది ఫాలోవర్స్ ఆయన వీడియోలకు ఫిదా అయిపోవడం మొదలైంది. ఓ కొత్త సినిమా రిలీజైతే, దానికోసం చూసే ఎదురుచూపుల తరహాలో కళ్యాణ్ దిలీప్ విడుదల చేయబోయే వీడియోల కోసం కొంతమంది ఎదురుచూస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2 లక్షల మంది ఫాలోవర్స్ కళ్యాణ్ దిలీప్ సుంకర యూట్యూబ్ ఛానల్ కామనర్ లైబ్రరీ కి లభించడం చాలా చాలా గొప్ప విషయం… ప్రతి వీడియో వేలాది లైక్స్ దక్కించుకుంటోంది అంటే వాటిల్లో విషయం ఎంత బాగా రీచ్ అవుతుందో అర్దం చేసుకోవచ్చు..
ఓ చెడ్డోడు వ్యవస్థల్ని శాసించడం ఎంత ప్రమాదకరమో.. ఓ మేధావి మౌనం అంతకన్నా ప్రమాదకరం. అందుకేనేమో, విషయ పరిజ్ఞానం మెండుగా వున్న కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటోళ్ళు.. సమాజంలో మంచి మార్పు కోసం చేసే ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నా.. అవి చాలామందిని మేల్కొలుపుతూనే వున్నాయి.