Advertisement

కరణ్ జోహార్ పై విరుచుకుపడ్డ కంగనా రనౌత్

Posted : March 30, 2021 at 8:52 pm IST by ManaTeluguMovies

ఫైర్ బ్రాండ్, ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే కంగనా రనౌత్ కెరీర్ పరంగా మాత్రం రివ్వున దూసుకెళ్ళిపోతోంది. కంగనా ఇటీవలే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అలాగే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా తలైవి ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో కంగనా నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ రీసెంట్ గా బాలీవుడ్ నటి, హోస్ట్ సిమి గారేవాల్ తన షో రెదెన్జ్వాస్ విత్ సిమి గారేవాల్ షో లో పాల్గొంది.

ఈ క్రమంలో కంగనా ఈ షో పై పాజిటివ్ గా కామెంట్ చేసింది. ఇదే షో లో జయలలితను కూడా ఇంటర్వ్యూ చేసింది సిమి గారేవాల్. తాను తైలవి సినిమాలో నటించేటప్పుడు అమ్మ గురించి తెలుసుకోవడానికి ఈ షో తనకు ఎంతగానో ఉపయోగపడింది అని తెలిపింది. అలాగే కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో కాఫీ విత్ కరణ్ షో ను ఉద్దేశిస్తూ వాళ్ళ ఇంటర్వ్యూలలో ఎప్పుడూ బిచింగ్, గాసిప్స్, వేరే వ్యక్తిని కించపరచడం వంటివే ఉంటాయి అని తెలిపింది.


Advertisement

Recent Random Post:

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Posted : October 3, 2024 at 2:41 pm IST by ManaTeluguMovies

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad