Advertisement

అమీర్ మాజీ భార్య కిరణ్‌ పై కంగనా కామెంట్స్‌

Posted : July 6, 2021 at 11:02 am IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం విషయంలో కొందరు సెలబ్రెటీలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేసింది. పంజాబ్‌ లో చాలా వరకు తమ ఇంట్లో ఒకరిని ఒకరిని హిందువుగా ఒకరిని సిక్కుగా పెంచేందుకు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా అలా ఎందుకు ఉండటం లేదు. ముస్లీం మతంలో అసలు ఆ పద్దతి ఎక్కడ కనిపించదు. హిందువు అయిన కిరణ్‌ రావు అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ముస్లీంగా మారిపోయారు అంటూ కంగనా ప్రశ్నించింది.

అమీర్ ఖాన్ తో పెళ్లి అయినంత మాత్రాన ఆమె మారాల్సిన అవసరం ఏముందని అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకును కిరణ్‌ రావు ఎందుకు ఒక హిందువుగా పెంచలేక పోయిందని కూడా ప్రశ్నించింది. మతాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన మతం మారాల్సిన అవసరం లేదు.. పిల్లలను ఇతర మతాల్లో పెంచాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇటీవల విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ కిరణ్‌ రావులు తమ బాబును మాత్రం ఇద్దరి బాధ్యతలతో పెంచబోతున్నట్లుగా పేర్కొన్నారు. పూర్తిగా ముస్లీం పద్దతిలో అతడు పెరుగుతాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

పన్నెండేళ్లుగా జైలులో ఉన్న భానుకిరణ్‌| Maddelacheruvu Suri Case | Bhanu Kiran Released From Jail

Posted : November 7, 2024 at 11:51 am IST by ManaTeluguMovies

పన్నెండేళ్లుగా జైలులో ఉన్న భానుకిరణ్‌| Maddelacheruvu Suri Case | Bhanu Kiran Released From Jail

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad