Advertisement

పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను.. కాబోయే భర్త గురించి త్వరలో చెప్తా

Posted : November 11, 2021 at 4:02 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడింది. అయితే ఆమె ముక్కుసూటి తనం మరియు ఇతర వ్యవహారాల వల్ల ఇద్దరికి సెట్ అవ్వలేదట. దాంతో మొదటి బ్రేకప్ అయిన కంగనా ఆ తర్వాత కూడా ఒక స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని అక్కడ కూడా ఎక్కువ కాలం కంగనా రిలేషన్ ను కొనసాగించలేక పోయింది. ఆ తర్వాత నుండి కంగనా రిలేషన్ షిప్.. లవ్ వ్యవహారాల గురించి మీడియాలో పెద్దగా వార్తలు రాలేదు.. కాని ఆమె వివాదాలు.. గొడవల గురించి మాత్రం రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె గురించి మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అభిమానులు కంగనా పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ విషయమై స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేసింది.

కంగనా రనౌత్ ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకుంటాను అంటూ పేర్కొంది. రాబోయే అయిదు ఏళ్లలో పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను కూడా కంటానంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని తనకు ఉందని.. పిల్లలను కని నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటీవలే పద్మ అవార్డును దక్కించుకున్న కంగనా రనౌత్ పలు సినిమాల్లో నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. అందులో జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి. కంగనా రనౌత్ కు సినిమాలపైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా చాలా శ్రద్ద ఆసక్తి ఉందని తాజాగా ఆమె ఇంటర్వ్యూ చూస్తే క్లారిటీ వచ్చింది.

పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనే విషయాన్ని త్వరలో చెప్తానంది. మిస్టర్ కంగనా రనౌత్ ఎవరు అనే విషయంపై ఉన్న ఊహా గాణాలకు కూడా ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. తన అంచనాలకు తగ్గట్లుగా.. ఒక మంచి వ్యక్తితో తాను జీవితంను పంచుకోబోతున్నాను అని.. ఆ మిస్టర్ కంగనా రనౌత్ ఎవరు అనే విషయాన్ని త్వరలోనే అందరికి తెలియజేస్తాను అంటూ అధికారికంగా ప్రకటించింది. కంగనా ఇటీవల తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా కాకుండా ప్రస్తుతం రెండు మూడు సినిమాలను ఆమె చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో కంగనా నటించిన సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. ఒక వైపు సినిమాల్లో ఇంత బిజీగా ఉన్న కంగనా మరో వైపు రాబోయే అయిదు ఏళ్లలో పెళ్లి చేసుకుని పిల్లలను కనేస్తాను అని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ కంగనా రనౌత్ ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చి ఉంటుందని.. ఆ విషయాన్ని ఆమె ఎప్పుడు బయటకు చెప్తుందో చూడాలంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూ కట్టిన టపాసుల బాధితులు | Diwali Celebrations

Posted : November 1, 2024 at 2:06 pm IST by ManaTeluguMovies

సరోజినీ దేవి ఆస్పత్రికి క్యూ కట్టిన టపాసుల బాధితులు | Diwali Celebrations

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad