సెలబ్రెటీలు ఏ ముచ్చట్లు చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిది వారు బెడ్ రూమ్ ముచ్చట్లు చెప్తే ఇంకా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంట్లో జరుగుతున్న వ్యవహారమే అయినా కూడా వారి ఇంట్లో ఏం జరుగుతుందా అంటూ అందరిలో ఒక రకమైన ఆసక్తి మరియు ఆతృత ఉంటుంది. ఇటీవల ఒక టాక్ షో లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ మాట్లాడుతూ తన బెడ్ రూమ్ ముచ్చట్లు చెప్పింది. తన బెడ్ రూమ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆమె టాక్ షో లో షేర్ చేసుకుని అందరిని ఆశ్చర్య పర్చింది.
హోస్ట్ మీరు బెడ్ రూమ్ కు వెళ్లే సమయంలో ఏం తీసుకు వెళ్తారంటూ ప్రశ్నించగా అందుకు కరీనా సమాధానంగా.. తాను బెడ్ రూమ్ కు వెళ్లే సమయంలో వైన్ బాటిల్ మరియు సైఫ్ అలీ ఖాన్ ను పట్టుకు పోతానంటూ చెప్పింది. భర్తతో పాటు వైన్ బాటిల్ కూడా బెడ్ రూం లో ఉండాల్సిందే అంటూ ఈమె ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమా లు చేస్తోంది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లు మరియు బుల్లి తెర షో లు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది.