Advertisement

‘కార్తికేయ 2’ షూటింగ్ లో హీరో నిఖిల్ కు గాయాలు..

Posted : March 10, 2021 at 8:19 pm IST by ManaTeluguMovies

హీరో నిఖిల్‌, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో కార్తికేయ 2 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్‌లో జరుగుతోంది. అయితే.. షూటింగ్ సమయంలో హీరో నిఖిల్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం కీలకమైన యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూండగా స్పాట్ లో యాక్సిడెంట్‌ అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో నిఖిల్‌కి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. వెంటనే షూటింగ్ నిలిపేశారని వార్తలు వస్తున్నాయి.

గుజరాత్ లోనే ఇంకా షూటింగ్ జరపాల్సి ఉంది. అయితే.. ఈ ప్రమాదం నేపథ్యంలో షూటింగ్ నిలిపేశారని వార్తలు వస్తున్నాయి. నిఖిల్ స్పల్ప గాయాలు అయ్యాయని.. అభిమానులు ఆందోళన చెందొద్దని యూనిట్ వర్గాలు అంటున్నాయి. నిఖిల్, చందూ మొండేటి కలయికలో వచ్చిన కార్తికేయ విజయం సాధించింది. సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరద | Special Report |

Posted : September 15, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరద | Special Report |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad