కత్తి మహేష్ అనే వ్యక్తికీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మధ్య వ్యక్తిగతమైన కక్ష, కార్పణ్యాలేమైనా వుంటాయా.? అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం కత్తి మహేష్‌కి ఏముంటుంది.? ఏమీ వుండదు. కత్తి మహేష్ ఓ సినీ నటుడు, ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఫిలిం క్రిటిక్ కూడా.
పవన్ కళ్యాణ్, తెలుగు తెరపై పవర్ స్టార్. జనసేన పార్టీకి అధినేత. జనసేన పార్టీ భావజాలాన్ని కత్తి మహేష్ విమర్శించొచ్చుగాక. రాజకీయాల్లో అది మామూలే. చాలామంది రాజకీయ నాయకులు జనసేన పార్టీని విమర్శిస్తారు. వారెవరి మీద పవన్ కళ్యాణ్ అభిమానులెందుకు ఇంతలా విరుచుకుపడలేదు.? అంటే, కత్తి మహేష్ కొందరి వలలో బంధీ అయిపోయాడు.. వారి చెప్పినట్టల్లా ఆడాడు. ఈ క్రమంలో అర్థం పర్ధం లేని ద్వేషాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద పెంచుకున్నాడు. అత్యంత జుగుప్సాకరమైన తీరుతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు.
నిజానికి, కత్తి మహేష్ కొందరి ప్రోద్బలంతో, వారికి తగ్గట్టు నటించాడనడం సబబేమో. ఆ విషయాన్ని జనసేనాని పవన్ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. అభిమానుల్లో కొందరికి ఒళ్ళు మండొచ్చు. దాన్ని జనసేనానికి అంటగడితే ఎలా.? ‘కత్తి మహేష్.. మీరు త్వరగా కోలుకోవాలి.. భవిష్యత్తులో మా పార్టీ సాధించబోయే విజయాన్ని మీరు చూడాలి..’ అని మాత్రమే జనసైనికులు కోరుకున్నారు.
లక్షలాది మంది జనసైనికులు, కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాక, ‘గెట్ వెల్ సూన్’ అని మాత్రమే పేర్కొన్నారు సోషల్ మీడియాలో. పది మందో పాతిక మందో, కత్తి మహేష్ మీద అసహనంతో ఊగిపోతే, దాన్ని లక్షలాది మంది, కోట్లాది మంది మంచి అభిమానులకీ అంటగట్టేస్తారా.? దాంతో అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏంటి సంబంధం.?
ఎవరైతే, కత్తి మహేష్‌కి ఏవేవో ఆశలు చూపి, పవన్ కళ్యాణ్ మీదకు ఎగదోశారో, వాళ్ళే నిజానికి పవన్ అభిమానులతో ఆయన్ని తిట్టించినట్లు బావించాల్సి వస్తుంది. కత్తి మహేష్ మరణించాక కూడా, లక్షలాది మంది పవన్ అభిమానులు, ‘ఓం శాంతి.. రెస్ట్ ఇన్ పీస్..’ అంటూ ట్వీట్లేశారు. కానీ, బులుగు పచ్చ మీడియా మాత్రం, కత్తి మహేష్ మరణం మీద కూడా మొసలి కన్నీరే కార్చుతోంది. ఆయన మీద జనసేన మద్దతుదారులు దారుణంగా మాట్లాడుతున్నారంటూ తమ వెకలి పైత్యాన్ని జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది.
ఇది నిఖార్సయిన బులుగు పచ్చ నాటకం. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటారే.. అదే బులుగు పచ్చ మీడియా చేస్తున్నది. నలుగురూ నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?