Advertisement

స్టార్ హీరో హీరోయిన్ పెళ్లికి వెళ్లే వారికి ఆంక్షలు

Posted : December 1, 2021 at 6:58 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ మరియు స్టార్ హీరో విక్కీ కౌశల్ ఒక్కటి అవ్వబోతున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు తమ ప్రేమ బంధంను పెళ్లిగా మార్చుకోబోతున్నారు. ఈ నెల 9వ తారీకున వీరి వివాహం రాజస్థాన్ లోని ఒక రాజమహల్ లో జరుగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాలను బయటకు అధికారికంగా ఈ జంట వెళ్లడించడం లేదు. పెళ్లికి అతి కొద్ది మంది ప్రముఖులను ఆహ్వానించారని సమాచారం అందుతోంది. పెళ్లికి హాజరు అవ్వబోతున్న ప్రముఖులకు ఈ కొత్త జంట పలు ఆంక్షలు విధిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క ఫొటో కూడా బయటకు వెళ్ల కూడదు అని వారు కోరుకుంటున్నారు. అందుకు గాను పెళ్లి అయ్యేంత వరకు గెస్ట్ లు ఎవురు కూడా తమ ఫోన్ లను వాడటానికి వీలు లేదు. ఏ విధంగా కూడా ఫొటోలు మరియు వీడియోలను బయటకు ఇవ్వడానికి లేదు. ఎంత పెద్ద హీరో అయినా కూడా ఫంక్షన్ ఎంట్రీ లో ఫోన్ ను హ్యాండవర్ చేయాల్సిందే అంటూ పెళ్లి నిర్వాహకులు అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియో ఫుటేజ్ ను కూడా సోషల్ మీడియా పెట్టడానికి లేదు అంటూ సిబ్బంది మరియు అతిథులకు పంక్షన్ ఆర్గనైజర్స్ సూచిస్తున్నారు.

కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ లు సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లి వార్తలు మొదట్లో వచ్చిన సమయంలో ఇద్దరు కొట్టి పారేశారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదు అన్నట్లుగా చెప్పారు. కాని ఇప్పుడు ఇద్దరు కూడా పెళ్లి కి సిద్దం అయ్యారు. ఈ పెళ్లిలో కత్రీనా యొక్క మాజీ ప్రియుడు అయిన ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాడు. కత్రీనా మరియు సల్మాన్ మద్య ఇప్పుడు స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే ఆమె పెళ్లికి సల్లూ భాయ్ హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి ఎవరు వెళ్లినా కూడా కండీషన్స్ అప్లై. ఖచ్చితంగా ఫోన్ లను వినియోగించరాదు. ఈ ఆంక్షలతో ఎంత మంది స్టార్స్ పెళ్లికి హాజరు అవుతారో చూడాలి.


Advertisement

Recent Random Post:

Unfiltered with Varun Sandesh || Varun Sandesh || Nikhil Vijayendra Simha

Posted : June 10, 2024 at 7:55 pm IST by ManaTeluguMovies

Unfiltered with Varun Sandesh || Varun Sandesh || Nikhil Vijayendra Simha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement