Advertisement

బాబోయ్ మీ సంపాదన కక్కుర్తి.. స్టార్ కపుల్ పై ట్రోల్స్

Posted : December 18, 2021 at 10:38 pm IST by ManaTeluguMovies

జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు.. సంఘటనలు ఉంటాయి. వాటిని జీవితం మొత్తం గుర్తుంచుకునేలా ప్లాన్ చేసుకునే వారు చాలా మంది ఉంటారు. పెళ్లి మరియు పెళ్లి తర్వాత కొత్త సంసార జీవితం అనేది జీవితాంతం గుర్తు పెట్టుకునే విషయం. అలాంటి మెమరబుల్ మూమెంట్స్ ను మిస్ చేసుకున్న వారు జీవితంలో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇన్ని తెలిసిన బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ లు కొత్త సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా సినిమాల్లో నటించేందుకు అప్పుడే నువ్వు అటు.. నేను ఇటు అన్నట్లుగా వెళ్లి పోయారు. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఇలా వెళ్లి పోవడం ను కొందరు అభినందిస్తుంటే కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

తమ వల్ల.. తమ పెళ్లి వల్ల షూటింగ్ లకు ఇబ్బంది కలుగవద్దు అనే ఉద్దేశ్యంతో చాలా ప్రొఫెషనల్ గా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటున్నారు. కొందరు మాత్రం పెళ్లి కొన్ని నెలల ముందు నుండే ప్లాన్ చేసుకున్నది. రెండు మూడు వారాల క్రితం ప్లాన్ చేయలేదు. కనుక ఆ సమయంలో షూటింగ్ లు లేకుండా చేసుకుంటే సరిపోయేది కదా అంటున్నారు. కేవలం డబ్బు కోసమే వీరిద్దరు షూటింగ్ లకు హాజరు అవుతున్నారు అనేది కొందరి వాదన. ప్రస్తుతం వీరిద్దరు షూటింగ్ లో బిజీగా ఉండటం సరే ప్రొఫెషనల్ అనుకుందాం.. కాని వీరు పెళ్లి వీడియో హక్కులు మరియు ఫొటో హక్కులు కూడా అమ్ముకోవడం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇలా పెళ్లి హక్కులను అమ్ముకుని కమర్షియల్ అనిపించుకున్న ఈ కొత్త జంట పెళ్లి అయిన వెంటనే హనీ మూన్ కు కాకుండా షూటింగ్ కు వెళ్లడంతో వీళ్లు మరింత కమర్షియల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీ సంపాదన కక్కుర్తి మరీ ఎక్కువ అయ్యింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సాదారణంగా అయితే స్టార్స్ సెలబ్రెటీల పెళ్లిళ్లకు బహుమానాలు అంగీకరించబడవు అంటూ ముందే ప్రకటిస్తారు. కాని వీరు మాత్రం బహుమానాలు స్వీకరించారు. సల్మాన్.. రణబీర్ లు కలిసి వీరికి పెళ్లి కానుకలుగా ఆరు కోట్లను సమర్పించారు. ఇతర కానుకలు అన్ని కలిపి దాదాపుగా 15 కోట్ల వరకు ఉండవచ్చు అనేది అంచనా. వీరు మరీ కమర్షియల్ కాకుంటే ఇంతగా కక్కుర్తి పడతారు అంటూ నెటిజన్స్ ఈ కొత్త జంటపై కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు వీరి సంపాదన రూట్స్ మరింత క్రియేటివిటీగా ఉంటాయేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Manamey Official Trailer | Sharwanand, Krithi Shetty | Sriram Adittya | Hesham Abdul Wahab

Posted : June 1, 2024 at 3:00 pm IST by ManaTeluguMovies

Manamey Official Trailer | Sharwanand, Krithi Shetty | Sriram Adittya | Hesham Abdul Wahab

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement