Advertisement

ముఖ్యమంత్రి కోసం ప్రతిపక్షానికి ఇంత తాపత్రయమేంటి?

Posted : July 8, 2020 at 2:52 pm IST by ManaTeluguMovies

రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. మిగిలిన సీఎంల మాదిరి అదే పనిగా.. మీడియా ముందుకు రావటం లాంటివి చేయరు. ఎవరెంత అనుకున్నా తాను ఎప్పుడైతే రావాలనుకుంటారో అప్పుడు మాత్రమే ప్రెస్ ముందుకు వచ్చి.. ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం ప్రెస్ నోట్ లో వెల్లడించటమే తప్పించి.. ముందుగా సమాచారంఇవ్వటం లాంటివి చేయరు.

మామూలు రోజుల్లో కేసీఆర్ తీరును పెద్దగా ప్రశ్నించేవారు కాదు. దీనికి కారణం తనకు తగ్గట్లుగా ప్రజల్ని.. మీడియాను.. సోషల్ మీడియాను అలవాటు చేసుకున్నారని చెప్పాలి. తాజాగా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అన్నింటికి మించి అంచనాలకు అందని రీతిలో అంతకంతకూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో భారీగా పెరుగుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. కేసీఆర్ ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.

మొన్నటి వరకూ నాలుగైదు రోజులకు ఒకసారి దర్శనమిచ్చే ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అస్సలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ట్విట్టర్ లో వేరీజ్ సీఎం కేసీఆర్? పేరుతో ఒక హ్యాష్ టాగ్ తో భారీగా ట్వీట్లు చేశారు. చివరికి అది ఆ రోజు ట్రెండింగ్ హ్యాష్ టాగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా విపక్ష నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? అంటూ సూటిప్రశ్నను సంధించారు.

రోజువారీగా ప్రభుత్వం చెప్పే కేసుల లెక్కకు.. కేసీఆర్ సర్కారు చూపించే లెక్కలకు సంబంధం లేదని ఆరోపించారు. కేసీఆర్ చీకటి కుట్రలో పాలు పంచుకునే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఇరవై మందిని తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయిన సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రికి తొత్తుగా మారారని చెప్పారు.

ఏపీ సీఎం కరోనా విషయంలో అద్భుతంగా పని చేశారని.. అందుకు తగ్గట్లే ఆ రాష్ట్రంలో పది లక్షల పరీక్షలు నిర్వహిస్తే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కేవలం లక్ష పరీక్షలు మాత్రమే జరిగాయని ధ్వజమెత్తారు. కరోనాకు చేసే చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మామూలుగానే డిమాండ్లు చేయటం నచ్చని కేసీఆర్ కు.. తాము కోరినంతనే కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే అవకాశం ఉందంటారా ఉత్తమ్?


Advertisement

Recent Random Post:

“Varahi Declaration” by Sri Pawan Kalyan in Tirupati | Public Meeting | Sanatana Dharma Raksha Board

Posted : October 3, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

“Varahi Declaration” by Sri Pawan Kalyan in Tirupati | Public Meeting | Sanatana Dharma Raksha Board

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad