Advertisement

లీక్: సర్కారు వారి పాట షూటింగ్ లో కీర్తి సురేష్ లుక్

Posted : January 27, 2021 at 7:02 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

అయితే షూటింగ్ స్పాట్ నుండి పిక్స్ లీక్ అవ్వడం సాధారణ విషయమే. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట షూటింగ్ స్పాట్ లో కీర్తి సురేష్ పిక్ లీకైంది. కీర్తి షాట్ కోసం రెడీ అవుతున్నట్లుగా ఈ పిక్ చూస్తే అర్ధమవుతోంది. ఆమె చీరలో ఉంది. లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

దుబాయ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారం వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ సర్కారు వారి పాటను తెరకెక్కిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం | Police Jeep Enters AIIMS Rishikesh’s Emergency Ward

Posted : May 23, 2024 at 6:55 pm IST by ManaTeluguMovies

హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం | Police Jeep Enters AIIMS Rishikesh’s Emergency Ward

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement